February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrimeTelangana

పుట్టినరోజు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు.. కానీ విధి మరోలా..

పుట్టినరోజు.. మంచిగా ప్లాన్ చేసుకున్నాడు.. ఫ్రెండ్స్‌తో దూంధాంగా ఎంజాయ్ చేద్దామనుకున్నాడు.. మంచిగా.. విశాఖపట్నం నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చాడు.. ముందు ప్లాన్ చేసిన విధంగానే ఫ్రెండ్స్ తో కలిసి అతను కూడా కీసర ప్రాంతంలోని యాద్గర్‌పల్లి గండి చెరువు దగ్గరకు వెళ్లారు.. ఫుల్లుగా తాగారు.. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో అర్ధం కాలేదు.. అందరూ కలిసి మత్తులోనే నీటిలోకి దిగారు.. చివరకు నీటిలో లోతులోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు నీటిలో గల్లంతయ్యాడు.. పుట్టిన రోజు నాడే.. చివరి రోజు అవుతుందని అనుకోలేదని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ విషాదకర ఘటన మేడ్చల్ జిల్లాలోని కీసరలో చోటుచేసుకుంది. చెరువు దగ్గర బర్త్‌డే చేసుకునేందుకు వెళ్లి విశాఖపట్నానికి చెందిన యువకుడు సూర్యదేవ్ మృతిచెందాడు.. యాద్గర్‌పల్లి గండి చెరువులో మునిగిపోయి సూర్యదేవ్.. మరణించినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఫ్రెండ్స్‌ని కలిసేందుకు సూర్యదేవ్ వైజాగ్ నుంచి వచ్చాడు.. బర్త్‌డే దావత్‌ కోసం అర్థరాత్రి స్నేహితులతో కలిసి సూర్యదేవ్ చెరువు దగ్గరకు వెళ్లాడు.. మద్యం మత్తులో చెరువులోకి దిగడంతో ప్రమాదం జరిగింది.. చెరువులోకి దిగి.. లోతులోకి వెళ్లడంతో 26 ఏళ్ల సూర్యదేవ్‌ .. చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

స్నేహితులు సాయి, తేజ, లోహిత్, కాలేష్‌తో కలిసి సూర్యదేవ్ పార్టీకి వెళ్లాడని.. ఆ తర్వాత ఈఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. అప్పటివరకు బర్త్ డే పార్టీని ఎంజాయ్ చేసిన స్నహితులు.. సూర్య నీళ్లలో మునిగి చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..

Also read

Related posts

Share via