Telangana Crime News: తోటి స్నేహితుడిని ర్యాగింగ్ చేసిన ఏడుగు పదో తరగతి విద్యార్థులను అధికారులు సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్‌ను కూడా విధుల నుంచి తప్పించారు.
తెలంగాణలో జరిగిన ఓ ఘటన విద్యార్థుల గతి తప్పుతున్న ప్రవర్తన తెలియజేస్తుంది. మహాత్మ జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో జరిగిన దారుణం తల్లిదండ్రులను నివ్వెర పరుస్తోంది. పదో తరగతి విద్యార్థులను కూడా ర్యాగింగ్ బూతం పట్టి పీడించే దృశ్యం అందర్నీ భయపెడుతోంది.
మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మహాత్మ జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో ఓ పదో తరగతి విద్యార్థిని తోటి విద్యార్థులే ర్యాగింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చుసింది. శారీరకంగా మానసికంగా ఆ విద్యార్థిని వేధించడమే కాకుండా వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడతామని కూడా బెదిరించారు. విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని కూడా బెదిరించారు.
గురుకుల పాఠశాలలో పదో చదువుతున్న బాధిత విద్యార్థి ఫిబ్రవరి 8వ తేదీన ఏదో పరీక్ష రాసేందుకు కాగజ్‌నగర్ వెళ్లాడు. తల్లిదండ్రులే పరీక్షకు తీసుకెళ్లి రాయించి తీసుకొచ్చారు. తర్వాత స్కూల్‌కు వెళ్లేందుకు ఆ విద్యార్థి సతాయించాడు. తాను వెళ్లనంటే వెళ్లబోనంటూ మొండికేశాడు. ఏదో చెప్పి అబ్బాయిని స్కూల్‌కు వెళ్లేలా ఒప్పించారు తల్లిదండ్రులు.
స్కూల్‌కు వెళ్లిన బాలుడు ఆదివారం తన తండ్రికి ఫోన్ చేశాడు. తాను స్కూల్‌లో ఉండలేనంటూ ఏడ్చి చెప్పాడు. త్వరగా స్కూల్‌కి వచ్చి తనను తీసుకెళ్లిపోవాలని గోల చేశాడు.
ఏం జరిగిందో అని కంగారులో స్కూల్‌కు పేరెంట్స్ వెళ్లారు. స్కూల్‌కు వచ్చిన తల్లిదండ్రులతో విద్యార్థి జరిగిన విషయాన్ని వివరించాడు. పదో తరగతికి చెందిన ఏడుగు విద్యార్థులు తనను వేధిస్తున్నారని పేర్కొన్నాడు. రోజూ నీళ్లు తెప్పించి కాళ్లు గడిగిస్తున్నారని ఇంకా చాలా చేయిస్తున్నారని వివరించాడు. డబ్బులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని బోరుమన్నాడు. ఇలా వేధించడమే కాకుండా వీటి సంగతి ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నాడని వెల్లడించాడు.
ఫిబ్రవరి 6 రాత్రి వారి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. గుంపుగా విద్యార్థులు వచ్చి వేధించడం ప్రారంభించారు. రాత్రి పది గంటల సమయంలో అంతా కలిసి బాధితుడిని ర్యాగింగ్ చేసి వీడియో రికార్డు చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టినట్టు చెప్పారు.
విషయం తెలుసుకున్న బాధితుడి తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ఇంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇలా ర్యాగింగ్ చేసిన వాళ్లను పిలిచి మందలించామని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
స్కూల్‌కు వచ్చిన బాధితుడి పేరెంట్స్ వచ్చి గొడవ చేయడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. దీంతో ప్రిన్సిపల్ ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. విద్యార్థిని ర్యాంగింగ్ చేసిన ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు.
అంతే కాకుండా ఈ ఘటన జరిగినప్పుడే స్పందించనందుకు ప్రిన్సిపాల్ ప్రకాశ్‌రావుపై కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ పోస్టు నుంచి ప్రకాశ్‌రావు తప్పించారు. విద్యార్థికి సరైన టైంలో న్యాయం చేయలేకపోయినందుకు విధుల నుంచి తొలగించారు.
ఈ ఘటన తర్వాత తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. తమ పిల్లల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తాయి. దీంతో అధికారులు జోక్యం చేసుకొని వారికి భరోసా ఇచ్చారు. ఇలాంటివి రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మాటి ఇచ్చారు. ఇందులో బాధిత విద్యార్థికి వేరే వాళ్ల నుంచి హాని లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు
Also read
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు
- POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు