February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Kurnool: రోజులాగా, పూజలు చేసేందుకు ఆలయం తెరిచిన పూజారి.. కనిపించింది చూసి షాక్!



వెల్దుర్తి మండలం మదర్‌పురంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ చోరీ జరిగింది. 44వ జాతీయ రహదారి అనుకుని ఉన్న మదర్ పురం గ్రామంలో వెలిసిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యకృత్యంలో భాగంగా పూజారి పూజలు చేసేందుకు వచ్చారు. అయితే గుడి తలుపులు తెరిచి చూసేసరికి హుండీ కనిపించకుండాపోయింది.

దొంగలు దేవుళ్లను కూడా వదిలిపెట్టడంలేదు. అందుకు నిదర్శనమే ఇటీవల ఆలయాల్లో వరసగా జరుగుతున్న చోరీలు. తాజాగా కర్నూలు జిల్లాలోని ఓ ఆలయంలో దొంగలు హుండీ చోరీకి పాల్పడడం కలకలం రేపుతోంది. అయితే హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు.. అందులోని డబ్బులు తీసుకోలేక బైకును హుండీని వదిలేసి పారిపోయారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీంతో ఈ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నా పోలీసులు.

వెల్దుర్తి మండలం మదర్‌పురంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ చోరీ జరిగింది. 44వ జాతీయ రహదారి అనుకుని ఉన్న మదర్ పురం గ్రామంలో వెలిసిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యకృత్యంలో భాగంగా పూజారి పూజలు చేసేందుకు వచ్చారు. అయితే గుడి తలుపులు తెరిచి చూసేసరికి హుండీ కనిపించకుండాపోయింది. బీరువా ఇతర అల్మారాలు తెరుచుకుని ఉండడం గమనించారు. దీంతో ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించి, గ్రామ ప్రజలకు, ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు



ఆలయ కమిటీ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆలయం దగ్గరకు వచ్చి సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. దొంగలు హుండీని ఎత్తుకుని వెళ్లిపోవటం గమనించి, దొంగల కోసం గాలింపు చేట్టారు. ఈ క్రమంలోనే గ్రామ సమీపంలో ఉన్న కోళ్ల ఫారం దగ్గర హుండీని కనిపించింది. దీని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అర్థరాత్రి కోళ్ల ఫారం వద్దకు వచ్చిన దొంగలు, హుండీ పగలగొట్టడానికి ప్రయత్నిచారు. శబ్దాలు రావడంతో కోళ్ల ఫారంలో పనిచేసే వ్యక్తులు కేకలు వేయడంతో అక్కడే హుండీని వదిలేసి, దొంగలు తెచ్చుకున్న బైకును కూడా వదిలేసి పారిపోయారు. గతంలో కూడా ఈ గుడిలో దొంగతనం జరిగినట్టుగా గ్రామ ప్రజలు పోలీసులకు తెలిపారు. హుండీతోపాటు ఇంకా ఏమన్నా పోయాయని, గుడిలోని వస్తువులు, హుండీ డబ్బులు ఏమి పోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

దొంగల బైక్, సీసీ ఫుటేజీ ఆధారంగా త్వరలో దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. రహదారికి సమీపంలో ఈ గ్రామము ఉండడంతో తరచుగా గుడిలో దొంగతనాలు జరుగుతున్నాయని, ఈ ఆలయానికి ప్రత్యేక భద్రత కల్పించాలని పోలీసులను కోరుతున్నారు గ్రామ ప్రజలు.

Also read

Related posts

Share via