పోలీసుల పని పోలీసులదే.. తమ పని తమదే అంటూ రెచ్చిపోతున్నారు మత్తు బ్యాచ్. పోలీసుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ సరికొత్త అవతారం ఎత్తుతున్నారు. ఒకదారి మూసుకుపోతే మరో దారి ఎంచుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తెలివిగా మత్తు బిజినెస్ చేసేస్తున్నారు. అయితే, ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు.
పోలీసుల పని పోలీసులదే.. తమ పని తమదే అంటూ రెచ్చిపోతున్నారు మత్తు బ్యాచ్. పోలీసుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ సరికొత్త అవతారం ఎత్తుతున్నారు. ఒకదారి మూసుకుపోతే మరో దారి ఎంచుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తెలివిగా మత్తు బిజినెస్ చేసేస్తున్నారు. అయితే, ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ క్రమంలోనే.. పోలీసుల్ని బైక్‌తో ఢీకొట్టి గంజాయి గ్యాంగ్ పరార్ అవ్వడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది.. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా దారులు రెచ్చిపోతున్నారు.. దీంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి .. తనిఖీలు నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలోనే.. బైక్‌పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసును నిందితులు బైక్ తో ఢీకొట్టి అక్కడినుంచి పరారయ్యారు.
గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బ్రిడ్జి సెంటర్ చెక్ పోస్టు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే.. తనిఖీల్లో భాగంగా బైక్‌పై వెళ్తున్న వారిని ఆపేందుకు ఓ పోలీసు ప్రయత్నించారు.. బారికేడ్ సాయంతో పోలీసు గంజాయ్ బ్యాచ్ ను అడ్డుకున్నా.. నిందితులు వాహనాన్ని ఆపకుండా ఏకంగా పోలీసును ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనలో పోలీసుకు స్వల్ప గాయాలైనట్లు పేర్కొంటున్నారు.
అయితే.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025