February 23, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: ఓ వ్యక్తిని ఆపి చెక్ చేసిన పోలీసులు.. ట్రాఫిక్ చలాన్లు చూడగా కంగుతిన్నారు



ఆ వ్యక్తి తన బైక్ పై బయటకు వచ్చాడు. ఈలోగా ఓ కూడలి దగ్గర పోలీసులు అతడ్ని ఆపారు. తన బైక్ కు ఎన్ని చలాన్లు వచ్చాయో చూశారు. ఇక అలా వచ్చిన డబ్బు చూసి దెబ్బకు కంగుతిన్నాడు సదరు వ్యక్తి.


ఒక బైక్‌కు ఉన్న నెంబర్ ప్లేట్, మరో బైక్‌కు ఉండదు. అసలు అలా ఉండే అవకాశమే లేదు. కానీ ఓకే నెంబర్ ప్లేట్‌తో మూడు బైక్‌లు ఉన్నాయి. అలా ఉండడమే కాదు ఆయా బైక్‌లపై పడ్డ ట్రాఫిక్ చలాన్లు అన్ని ఒక్క వ్యక్తికే వస్తున్నాయి. అవును.! మీరు విన్నది నిజమే. ఆర్టీఏ చలాన్లు చూసి మెదక్ జిల్లాలో ఓ స్కూటీ ఓనర్ షాక్ అయ్యాడు. తనకు తెలియకుండానే రూ. 4వేలకు పైగా తన స్కూటీపై ట్రాఫిక్ చలాన్లు పడటం చూసి కంగుతిన్నాడు.


వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా శివ్వంపేటకి చెందిన గుండం ప్రభాకర్ గుప్తాకి ఒక స్కూటీ ఉంది. అయితే అతను హైదరాబాద్ వెళ్లినట్లు అక్కడ.. అతని స్కూటీకి చలన్లు పడ్డట్టు తెలుసుకొని షాక్ అయ్యాడు. తన స్కూటీ నెంబర్ వాడుకొని హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న కేటుగాళ్ల ఆట కట్టించాలని పోలీసులను కోరుతున్నాడు. ఒకే నెంబర్ ప్లేట్‌తో రోడ్డుపైకి మూడు స్కూటీలు ఎలా తిరుగుతాయని ఆందోళన చెందుతున్నాడు.

తీరా అసలు ఓనర్‌కు చలాన్లు దర్శనం ఇవ్వడంతో అవాక్ అయ్యాడు. 2020-21 మధ్య 7 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడగా, 4745 రూపాయల చలాన్లు పడ్డాయి. TS 35 B 3539 నెంబర్‌తో తనది గోల్డ్ కలర్ స్కూటీ అని.. దీనిని మూడు సంవత్సరాల క్రితం కొనుగోలు చేశానని చెప్పుకొచ్చాడు. ఇటీవల తన బైక్‌ను పోలీసులు ఆపి చెక్ చేయగా.. అతని బైక్‌పై ఉన్న చలాన్లు చూసి షాక్ అయ్యాడు. ఎవరో దొంగ నెంబర్ ప్లేట్ పెట్టుకొని తిరుగుతూ, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపించాడు. తనను మోసం చేసిన కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు

Also read

Related posts

Share via