February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hijra Murder : కూకట్ పల్లిలో హిజ్రా హత్య..అసలేం జరిగిందంటే..


కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ సమీపంలో గుర్తు తెలియని హిజ్రా మృతదేహం లభ్యమైంది. హిజ్రామృతదేహన్నిగుర్తించిన స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు డెడ్ బాడీని పరిశీలించారు.క్లూస్ టీం,డాగ్ స్క్వాడ్ ను రప్పించిఆధారాలనుసేకరించారు

Hijra Murder : కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ సమీపంలో గుర్తు తెలియని హిజ్రా మృతదేహం లభ్యమైంది. ఈ రోజు ఉదయం హిజ్రా మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రప్పించి ఆధారాలను సేకరించారు. హిజ్రా మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండడటంతో మరణించి చాలా రోజులు అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా హిజ్రాను ఎవరన్న హత్య చేశారా? లేక హత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ మధ్య హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ లు చోటు చేసుకుంటున్న క్రమంలో ఆమెను ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా అనే కోణంలో ఎంక్వరీ చేస్తున్నారు. కానీ స్థానికంగా ఉన్న హిజ్రాలను సంఘటన స్థలానికి రప్పించి మృతి చెందిన హిజ్రాను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Also read

Related posts

Share via