February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

మరో మీర్ పేట్.. ప్రేమించిందని బిడ్డను ముక్కలుగా నరికి.. ఆ కసాయి తండ్రి ఏం చేశాడంటే.. !?


జార్ఖండ్‌లో పరువు హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సోదరి ప్రేమ వ్యవహారంతో కలత చెందిన ఇద్దరు సోదరులు ఆమె గొంతు కోసి చంపారు, ఆ తర్వాత ఆమె తండ్రి తన కూతురు తలను, ఎడమ చేతిని నరికివేశాడు. ఈ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించి, తండ్రీకొడుకులను అరెస్టు చేశారు.

జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలోని భయంకరమైన పరువు హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సోదరి ప్రేమ వ్యవహారంతో కలత చెందిన ఇద్దరు సోదరులు ఆమె గొంతు కోసి చంపారు, ఆ తర్వాత ఆమె తండ్రి తన కూతురు తలను, ఎడమ చేతిని నరికివేశాడు. ఈ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించి, తండ్రీకొడుకులను అరెస్టు చేశారు.

పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం… నిభా అనే యువతి  ఫిబ్రవరి 2న హత్యకు గురైంది. సోదరులు, నితీష్ పాండే (36),  జ్యోతి కుమార్ పాండే (20)లు ఆమెను గొంతు కోసి చంపి, మృతదేహాన్ని ఎనిమిది రోజుల పాటు ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో దాచిపెట్టారు . అయితే దుర్వాసన రావడంతో ఆమె తండ్రి మదన్ మోహన్ పాండే నిభా మృతదేహాన్ని బయటకు తీసి  నరికి ఓ నది ఒడ్డున ఇసుకలో పాతిపెట్టాడు. కానీ కొన్ని రోజుల తర్వాత జంతువులు ఆ మృతదేహాన్ని ఆహారం కోసమని బయటకు లాగడంతో అసలు విషయం బయటపడింది. ఈ హత్య గ్రామంలో సంచలనం సృష్టించింది.

ప్రేమ వ్యవహారం కారణంగా 
నిభా కనిపించకపోవడంతో  ఫిబ్రవరి 3న మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు ఆమె సోదరులను అనుమానంతో అదుపులోకి తీసుకుని  విచారించగా ఆమెను హత్య చేసినట్లు అంగీకరించారు. ప్రేమ వ్యవహారం కారణంగా ఆమెను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. జ్యోతిష్ కుమార్ పాండే తన సోదరిని ఒక అబ్బాయితో మాట్లాడినందుకు తరచుగా మందలించేవాడనని ఒప్పుకున్నాడు. ఫిబ్రవరి 2న వారిని మళ్ళీ చూసిన తర్వాత కోపంతో ఆమె గొంతు కోసి చంపామని… ఆమె మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో దాచిపెట్టామని తెలిపారు. అయితే, పోలీసులు కనుగొంటారనే భయంతో ఫిబ్రవరి 11 రాత్రి మృతదేహాన్ని బయటకి తీసి, నది ఒడ్డుకు తీసుకువెళ్లామని..  అక్కడ తమ తండ్రి మదన్ పాండే శవాన్ని తల నరికి, అవశేషాలను విడిగా పాతిపెట్టాడని తెలిపారు. 

నిందితులు అందించిన సమాచారం ఆధారంగా, మృతదేహాన్ని మొదట దాచిపెట్టిన సెప్టిక్ ట్యాంక్‌లో లభించిన వెంట్రుకలతో పాటు, నేరానికి ఉపయోగించిన సైకిల్, ఒక సంచి, గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  వైద్య పరీక్షలో యువతి తల, చేయిను పదునైన ఆయుధంతో వేరు చేయబడిందని తేలింది. హత్య చాలా దారుణంగా జరిగిందని వైద్యులు అభిప్రాయపడ్డారు. హంతకులు వేరే చోట పాతిపెట్టిన నిభా తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also read

Related posts

Share via