ప్రియుడితో కలిసి భర్తను ఓ కారు షోరూమ్ దగ్గరలో ఉన్న తోటకు మందు సిట్టింగ్ కి తీసుకెళ్లింది. ఇక ఆ తర్వాత జరిగిన సీన్ చూస్తే దెబ్బకు మీ మైండ్ బ్లాంక్ కావడం ఖాయం. మరి ఆ స్టోరీ ఏంటో తెలియాలంటే..
క్షణికానందం కోసం.. ప్రియుడితో కలిసి ఉండేందుకు.. భర్త అడ్డొస్తున్నాడని.. అతి దారుణంగా హత్య చేయించింది ఆ ఇల్లాలు.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం మల్కాపురంకు చెందిన కాశీ, సౌభాగ్య దంపతులు అనంతపురం రూరల్ కక్కలపల్లిలోని టమాటా బండిలో కూలీలతో మేస్త్రీ పని చేస్తుంటారు. రెండు నెలల క్రితం చీరల వ్యాపారం చేసేందుకు భర్త కాశి హైదరాబాద్ వెళ్ళాడు. దీంతో టమాటా బండిలో కూలీ పనులు చేసేందుకు వచ్చిన నవాజ్ బేగ్‌తో కాశీ భార్య సౌభాగ్య సన్నిహితంగా మెలిగింది. సన్నిహితం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. సౌభాగ్య, నవాజ్ బేగ్ అక్రమ సంబంధం ఆ నోటా ఈ నోటా భర్త కాశీకి తెలిసింది. అక్రమ సంబంధాలు పెట్టుకున్న భార్య సౌభాగ్యను, ప్రియుడు నవాజ్‌ను చంపేస్తానని బెదిరించాడు. దీంతో భార్య సౌభాగ్య ఇక తన అక్రమ సంబంధానికి అడ్డుస్తున్న భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు నవాజ్‌తో కలిసి పక్క ప్లాన్ వేసింది.
ఈ నెల రెండో తేదీన భర్త కాశీకి మాయమాటలు చెప్పి.. భార్య సౌభాగ్య, ప్రియుడు నవాజ్ అనంతపురం శివారులోని కియా కార్ షోరూమ్ దగ్గర ఫుల్‌గా మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న కాశీని ప్రియుడు నవాజ్ బీర్ బాటిల్‌తో తలపై కొట్టి.. బండరాయితో ముఖంపై మోది హత్య చేశారు. మరుసటి రోజు ఏమి ఎరగనట్టు భార్య సౌభాగ్య తన భర్త కాశీ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. భార్య సౌభాగ్యపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో అసలు విషయం బయటపడింది.
ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త కాశీని చంపించిన భార్య సౌభాగ్య, ప్రియుడు నవాజ్ బేగ్, హత్యకు సహకరించిన మరో వ్యక్తి గౌస్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. క్షణికానందం కోసం.. జీవితాంతం తోడుంటానని పెళ్లి చేసుకున్న భర్తను కాదని.. జీవితాంతం ప్రియుడితో కలిసి ఉండాలనుకున్న భార్య సౌభాగ్య ఊచలు లెక్కపెడుతోంది
Also read
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు
- POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు