అనకాపల్లి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు.. రాంబిల్లి మండలంలోని వాడపాలెం ఉన్న సముద్రంలో స్నానానికి దిగి ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. కాగా గల్లంతయిన విద్యార్థులను పవన్ తేజ, సూర్య తేజలుగా గుర్తించారు…
AP News : అనకాపల్లి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు.. రాంబిల్లి మండలంలోని వాడపాలెం ఉన్న సముద్రంలో స్నానానికి దిగి ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. కాగా గల్లంతయిన విద్యార్థులను పవన్ తేజ, సూర్య తేజలుగా గుర్తించారు.. సూర్య తేజ మృతదేహం లభ్యం కాగా పవన్ తేజ ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. వీరిద్దరూ విజ్ఞాన్, అనిట్స్ కాలేజీల్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు.. విశాఖపట్నం జిల్లా కంచరపాలానికి చెందిన బీటెక్ చదువుతున్న ఎం సూర్య తేజ మృతదేహం బయటపడగా. దువ్వాడ ప్రాంతానికి చెందిన బీటెక్ చదువుతున్న పవన్ తేజ కోసం సముద్రంలో పోలీసులు
గాలిస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల మృతితో విద్యార్థుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. తీవ్ర విషాదం నెలకొంది.. బీచ్ వద్దకు చేరుకున్న పవన్ తేజ కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సముద్రంలో గల్లంతైన వీరిద్దరూ వరుసకు అన్నదమ్ములు కావడంతో రెండు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులంతా విశాఖలో నివాస ఉంటున్నారు. రాంబిల్లి మండలం కొత్తపేట స్వగ్రామం లో ఆదివారం పండుగ చేసుకునేందుకు స్వగ్రామానికి వీరంతా కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన వారంతా పండుగ జరుపుకొని సముద్ర తీరంలో సముద్ర స్నానాలు చేసేందుకని వెళ్లిన సమయంలో అలల తాకిడికి వీరిద్దరూ గల్లంతయ్యారు. సంఘటన స్థలాన్ని పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ సందర్శించారు. స్వగ్రామంలో పండుగ కోసం వచ్చి ఇద్దరు అన్నదమ్ములు సముద్రంలో గల్లంతవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్రంలోకి స్నానానికి 12 మంది విద్యార్థులు దిగారు. అందులో.. తుర్ల అర్జున్, బంగా బబ్లు గల్లంతయ్యారు. మిగతా పది మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.
Also read
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు
- POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు