రంగారెడ్డి జిల్లాలో మరో కీచక టీచర్ వ్యవహారం బయటపడింది. ఇబ్రహీంపట్నం లయోల స్కూల్ లోని ప్రిన్సిపల్ దీనావన్ రావు పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రిన్సిపల్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
Teacher Harassment News: చదువులు చెప్పే టీచర్లు కామకోరికలతో నీతిమానుల పనులు చేస్తున్నారు. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో కీచక టీచర్ వ్యవహారం బయటపడింది. పాఠశాలలో చదివే విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నం లయోల స్కూల్ లోని ప్రిన్సిపల్ దీనావన్ రావు టెన్త్ విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశాడు. విద్యార్థిని జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పడంతో దినావర్ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె పేరెంట్స్. ప్రిన్సిపల్ దీనావన్ రావుపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. దినావర్ రావుపై గతంలోనూ లైంగికదాడి
ఆరోపణలున్నాయి. విద్యార్థినులను లోబర్చుకొని అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ సారి ఇలాగే చేస్తే విద్యార్థిని తల్లిదండ్రులు ఇతనికి దేహశుద్ది చేశారు. ఇలాంటి ప్రిన్సిపల్‌ను అసలు వదలకూడదని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి.
Also read
- జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు తెలుసుకోవాల్సిన ఆచారం ఇదే!
- నాలుగు నవరాత్రులు.. నాలుగు శక్తి స్వరూపాలు! ఏ నవరాత్రిలో ఏ అమ్మవారిని పూజిస్తారో తెలుసా?
- Navratri: దేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలు ఇవే.. నవరాత్రుల్లో దర్శిస్తే ప్రత్యేకమే!
- నేటి జాతకములు 9 అక్టోబర్, 2026
- మోనాలిసా అమ్మాయి అనుకున్నాడు.. గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే, ఆ ఒక్క ఫోన్ కాల్తో..





