అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
పట్టణ పరిధిలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న నాగభూషణం అనే ఉద్యోగి ఆర్డీవో కార్యాలయాన్ని తన సొంత ఇంటి బెడ్ రూమ్ గా వాడుకుంటున్నాడు.
ప్రతిరోజు రెవెన్యూ కార్యాలయంలోనే మంచాన్ని వేసుకొని పడకేస్తున్నాడు .
అంతటితో ఆగకుండా రాత్రిపూట ఉద్యోగాలు నిర్వహిస్తున్న కార్యాలయ సిబ్బందిని కూడా తాను ఉన్నంతవరకే ఇక్కడ ఉండాలంటూ హూకూం జారీ చేస్తున్నాడు.
గతంలో కూడా ఇక్కడ ఓ ఉద్యోగిని డిప్టేషన్ కూడా పంపించినట్టు సమాచారం మీరు ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని కూడా ఇక్కడి నుంచి పంపి వేస్తానంటూ కాంట్రాక్టు ఉద్యోగులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
దీంతో పై అధికారి కావడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో చిన్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ కార్యాలయంలో మంచమేసి పడుకుంటున్న అధికారి పై స్పందించాల్సిన ఆర్డీవో కూడా మీడియా వారు వీడియో చిత్రికించారని మీడియా వారిపై కూడా కేసు పెడతానంటూ బెదిరిస్తున్నాడు.
అదేవిధంగా నా అనుమతి లేకుండా ఆర్డిఓ చుట్టుపక్కలకు వచ్చిన విలేకరులును నా విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని విలేకరులు బెదిరిస్తున్నాడు.
ప్రభుత్వ కార్యాలయాన్ని తన సొంత ఇంటిగా వాడుకుంటు ఉండడం పై ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది .
ఇప్పటికైనా ఈ ఘటనపై జిల్లా ఉన్నత అధికారులు స్పందించి ప్రజల కార్యాలయాన్ని తన సొంత ఇంటికా వాడుకుంటున్న అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ అధికారికి వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారి శ్రీనివాసులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




