February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshSpiritual

124వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం……



గుంటూరు నగరంలో ఉన్న పురాతన శివాలయం అయిన అరండల్ పేట శివాలయంలో 124వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ  అర్చకులు కుందుర్తి సుబ్రమణ్య శర్మ తెలిపారు. జగద్గురు శంకరాచార్య శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య సంస్థానం శ్రీ విద్యారణ్య భారతిస్వామి పరిపాలిత శ్రీ గంగా మీనాక్షి సోమసుందరస్వామి వారి దేవాలయం…4/4 అరండల్ పేట, గుంటూరు నగరంలో
స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర మాఘ శుద్ధ త్రయోదశి ది.06-02-2025 గురువారము సా॥ గం. 4-00 లకు శ్రీ గంగా మీనాక్షి సోమ సుందరేశ్వరస్వామి వారికి 124వ వార్షిక బ్రహ్మోత్సవములు ప్రారంభం శ్రీ విద్యారణ్య భారతిస్వామి వారి ఆశీస్సులతో…06-02-2 025 నుండి  10-02-2025 తేదీ వరకు 124వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమములు జరుగుతుంది. 11వ తేదీన మధ్యాహ్నం సుమారు 5000 మంది భక్తులకు స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం ప్రసాద వితరణ జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ ఆలయ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు కుందుర్తి భాస్కర శర్మ, కుందుర్తి సుబ్రహ్మణ్య శర్మ, యు. మధు శర్మ, కుందుర్తి శ్రీనివాసు తెలిపారు.

*బ్రహ్మోత్సవాలలో జరిగే ముఖ్య కార్యక్రమ వివరములు*

ది. 06-02-2025 గురువారము శుద్ధ నవమి

సా॥ గం. 4-00 లకు స్వస్తి వాచనం, గోపూజ, దేవాలయ ప్రదక్షిణ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, పంచగవ్యప్రాసన, ఋత్విగ్వరణము సా॥ గం. 6-00 లకు అంకురారోపణ, మండపారాధన, ధ్వజారోహణ

ది. 07-02-2025 శుక్రవారము శుద్ధ దశమి

ఉ॥ గం. 8-00 లకు గణపతి హోమం, ఉపాలయమూర్తులకు అభిషేకములు సా॥ గం. 6-00 లకు మండప పూజలు, నీరాజన మంత్రపుష్పములు.

ది. 08-02-2025 శనివారము శుద్ధ ఏకాదశి ఉ॥ గం. 8-00 లకు నవచండీ పారాయణ, చండీహోమం సా॥ గం. 6-00 లకు సామూహిక లలితా సహస్రనామ పారాయణం

ది. 09-02-2025 ఆదివారము శుద్ధ ద్వాదశి

ఉ॥ గం. 8-00 లకు మహన్యాసపూర్వక మహారుద్రాభిషేకం, బిల్వార్చన సా|| గం. 6-00 లకు వీరభద్ర అర్చన, మండప పూజలు, హారతి మంత్రపుష్పము.

ది. 10-02-2025 సోమవారము శుద్ధ త్రయోదశి

ఉ॥ గం. 8-00 లకు రుద్రహోమం, పూర్ణాహుతి, ధ్వజఅవరోహణ సా॥ గం. 6-00 లకు గంగామీనాక్షి సోమసుందరేశ్వస్వామివారికి శాంతి కళ్యాణము
ది. 11-02-2025

ఉ॥ గం. 8-00 లకు శ్రీ గంగా మీనాక్షి సోమసుందరస్వామి వార్ల నందివాహనసేవ

మ॥ గం. 12-00 లకు అన్నప్రసాద వితరణ

ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొను భక్తులు వారి గోత్రనామములను వచ్చి ముందుగా నమోదు చేసుకోవాల్సిందిగా ఆలయ  అర్చకులు తెలిపారు.

Also read

Related posts

Share via