Khammam: లైంగిక వేధింపులకు పాల్పడిన డిప్యూటీ వార్డెన్‌పై విచారణ చేసిన అధికారులు ఆయనను సస్పెండ్ చేయడంతో చేయని తప్పుకు బాధితున్ని చేసి సస్పెండ్ చేశారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు డిప్యూటీ వార్డెన్. అయితే విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు..
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు వార్డెన్ భూక్యా వెంకటేశ్వర్లు. వసతిగృహంలో నివాసముంటున్న బాలుర విద్యార్థులను రోజుకొకరిని రూంలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులు పాల్పడుతున్నారు. రాత్రి రూంకు రాకుంటే టీసీ ఇస్తాను..మీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. కారేపల్లి మండలం రేల కాయల పల్లి ఆశ్రమ బాలుర పాఠశాల డిప్యూటీ వార్డెన్ వెంకటేశ్వర్లు పై ఫోక్సో కేసు నమోదు అయ్యింది. ఆశ్రమ పాఠశాలలోని బాలురపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు తో ఫోక్సో కేసు నమోదు చేశారు కారేపల్లి పోలీసులు.
లైంగిక వేధింపులకు పాల్పడిన డిప్యూటీ వార్డెన్‌పై విచారణ చేసిన అధికారులు ఆయనను సస్పెండ్ చేయడంతో చేయని తప్పుకు బాధితున్ని చేసి సస్పెండ్ చేశారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు డిప్యూటీ వార్డెన్. అయితే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు
Also read
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
- Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
- Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
- Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే
- Telangana: బెట్టింగ్ యాప్‌కు కానిస్టేబుల్ బలి..! పోలీస్ స్టేషన్‌లోని పిస్టల్ తీసుకొని అకస్మాత్తుగా..





