February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..



కరీంనగరూరల్: వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే  కోపంతో కరీంనగర్ శివారు బొమ్మకల్లో ఆదివారం రాత్రి ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం.. బొమ్మకల్కు చెందిన బెజ్జంకి మహేశ్(22) ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. కొంతకాలం నుంచి కాల్వ సతీశ్కు ఓ మహిళతో ఉన్న సంబంధం వ్యవహారంలో మహేశ్తో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కొత్త గ్రామ పంచాయతీ భవనం సమీపంలో సతీశ్తో ఉన్న వివాదాన్ని పరిష్కరించాలని మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ వ్యక్తిని మహేశ్ కోరాడు.

దీంతో సదరు వ్యక్తి వెంటనే కాల్వ సతీశ్ను అక్కడికి పిలిపించారు. ముగ్గురు కలిసి మద్యం తాగుతుండగా.. కాల్వ సతీశ్, బెజ్జంకి మహేశ్ ల మధ్య వివాదమేర్పడింది. ఈక్రమంలో సతీశ్ బీరు సీసాను పగలగొట్టి మహేశ్ గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారమందుకున్న రూరల్ ఏఎస్పీ శివం ప్రకాశ్, సీఐ ప్రదీప్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. స్థానికులను వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం కోసం మహేశ్ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also read

Related posts

Share via