ఇదిగో ఏవండి. మిమ్మల్ని. నా మాట వినండి. మనకున్నది ఒక్కతే కూతురు. కూతూర్ని బాగా చదవించాలి. దాని పెళ్లి చేయాలి. ఇవన్ని చేయాలంటే డబ్బులు బాగా అవసరం. అందుకే మీరో ఈ త్యాగం చేయండి. మీ కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేయ్యండి. డబ్బులు వస్తాయి. వచ్చిన డబ్బును బ్యాంక్లో వేద్దాం. ఆ డబ్బే భవిష్యత్తులో కూతురు చదువు, పెళ్లికి ఉపయోగపడతాయి’ అంటూ ఓ మహిళ భర్త కిడ్నీని అమ్మేందుకు ఒప్పించింది. చివరికి ఏం చేసిందంటే?
పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ మహిళ తన భర్త కిడ్నీని విక్రయించమని బలవంతం చేసింది. భార్య పోరు తట్టుకోలేక భర్త తన కిడ్నీని అమ్మాడు. ఆ డబ్బుతో తన ప్రేమికుడితో కలిసి భార్య పారిపోయింది. నివ్వెరపోయే ఉదంతం హౌరా జిల్లాలోని సంక్రైల్లో జరిగింది. సంక్రైల్కు చెందిన ఓ మహిళ తన కుమార్తె చదువు, పెళ్లి కోసం డబ్బును పొదుపు చేస్తాననే నెపంతో అతని కిడ్నీని రూ. 10 లక్షలకు అమ్మాలని తన భర్తపై ఒత్తిడి తెచ్చింది.
భార్య తెస్తున్న ఒత్తిడికి తట్టుకోలేక భర్త కిడ్నీని విక్రయించేందుకు అంగీకరించాడు. అదే సమయంలో తన అవయవ దానం చేయగా వచ్చిన డబ్బు భవిష్యత్తులో కుమార్తె చదువు, వివాహం చేయడం సులభం అవుతుందని ఆశించాడు. భార్య దురుద్దేశాన్ని పట్టించుకోలేదు.
దీంతో నిందితురాలు, తన ప్రియుడితో కలిసి భర్త కిడ్నీని అమ్మేందుకు సిద్ధమైంది. భర్త కిడ్నీని అమ్మేందుకు సుమారు ఏడాది పాటు ప్రయత్నించింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం కిడ్నీ అవసమరయ్యే వ్యక్తి దొరికాడు. కిడ్నీని అమ్మగా రూ.10లక్షలు వచ్చాయి.
ఫేస్బుక్ ప్రేమికుడితో
బాధిత భర్త పేదరికం నుంచి కుటుంబాన్ని గట్టెక్కించేందుకు ప్రాణ త్యాగానికి సిద్ధమైతే, భార్య ఫేస్బుక్లో యాక్టీవ్ ఉండే బరాక్పూర్కు చెందిన పెయింటర్ ప్రేమలో మునిగి తేలింది. భర్త కిడ్నీ అమ్మగా వచ్చిన రూ.10లక్షలు తీసుకుని ప్రియుడితో పరారైంది.
ఓ వైపు అనారోగ్య సమస్యలు, కుమార్తె భవిష్యత్తు.. మరోవైపు రోజులు గడుస్తున్నా అడ్రస్ లేని భార్య జాడ. దీంతో ఏం చేయాలో పాలుపోక భర్త పోలిసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో భార్య ఆచూకీ లభ్యమైంది. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు తేలింది.
అనంతరం, భర్త తన పదేళ్ల కుమార్తె తన కుటుంబ సభ్యుల్ని వెంటబెట్టుకుని భార్య నివాసం ఉండే ఇంటికి వెళ్లారు. పదేళ్ల కూతుర్ని చూసైనా ఆ తల్లి గుండె కరుగుతుందేమోనని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. ప్రియుడి మోజులో పడ్డ బాధితురాలు భర్తను బెదిరించింది. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. నీకు విడాకులు ఇస్తా. నేను ఈ గడప దాటి బయటకు రాను అంటూ ప్రియుడి ఇంట్లోనే ఉండిపోయింది.
భార్య చేసిన నిర్వాకంతో మనోవేధనకు గురయ్యాడు. కుమార్తెకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ధృడ సంకల్పంతూ వడివడిగా అడుగులేసుకుండూ ఇంటికి పయనమయ్యాడు బాధిత భర్త.
Also read
- Kolkata: ఆర్జీ కర్ ఆసుపత్రి విద్యార్ధిని ఆత్మహత్య
- కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీ అమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..
- వివాహేతర సంబంధం: భర్తను చంపిన భార్య 10 మంది అరెస్టు
- ప్రియుడి కోసం ఇల్లు వదిలి.. పోలీసుల చేతిలో..!
- రథ సప్తమి విశిష్టత