February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

తెలుగు రాష్ట్రాల్లోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. పబ్‌‌లో ఎంజాయ్ చేస్తూ.. చివరకు అలా..



2020లో మొదటిసారి విశాఖలో అరెస్ట్‌ అయిన ప్రభాకర్‌.. 2022లో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతడి అచూకీ పసిగట్టి పక్కా సమాచారంతో ప్రిజం పబ్‌కి వచ్చారు పోలీసులు.. బత్తుల ప్రభాకర్‌ను ట్రాక్‌చేస్తూ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాల్పులకు తెగబడ్డాడు..


హైదరాబాద్‌ గచ్చిబౌలిలో గన్‌ ఫైరింగ్‌ కలకలం రేపింది. పోలీసులపై కాల్పులు జరిపాడు మోస్ట్‌ వాంటెడ్‌ నిందితుడు బత్తుల ప్రభాకర్‌. ప్రిజం పబ్‌లో ఉన్న ప్రభాకర్‌ను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కాల్పులకు తెగబడ్డాడు. రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో కానిస్టేబుల్‌ వెంకట్‌రెడ్డి, బౌన్సర్‌కు బుల్లెట్‌ గాయాలయ్యాయి. తప్పించుకునేందుకు ప్రయత్నించిన దొంగను అతికష్టం మీద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిత్తూరు జిల్లాకి చెందిన 26ఏళ్ల ప్రభాకర్‌పై తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా చోరీ, దోపిడీ కేసులు ఉన్నాయి. నార్సింగి, రాజేంద్రనగర్‌లో అనేక కేసులు ఉన్నట్టు చెప్పారు మాదాపూర్‌ డీసీపీ వినీత్‌..


2020లో మొదటిసారి విశాఖలో అరెస్ట్‌ అయిన ప్రభాకర్‌.. 2022లో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతడి అచూకీ పసిగట్టి పక్కా సమాచారంతో ప్రిజం పబ్‌కి వచ్చారు పోలీసులు.. బత్తుల ప్రభాకర్‌ను ట్రాక్‌చేస్తూ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.



దాంతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు ప్రభాకర్‌. అతడిని నిలువరించే ప్రయత్నంలో కానిస్టేబుల్‌ వెంకట్‌రెడ్డి, బౌన్సర్‌కు బుల్లెట్‌ గాయాలు అయ్యాయి. మరోవైపు కాల్పులు జరగడంతో ఏం జరుగుతుందో తెలియక పబ్‌లో ఉన్నవాళ్లంతా భయభ్రాంతులకు గురయ్యారు..


కాగా.. తెలంగాణ, ఏపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ 80 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. బత్తుల ప్రభాకర్‌ను అరెస్టు చేసి అతని వద్ద 2 గన్‌లను, 23 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలాఉంటే.. పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ బత్తుల ప్రభాకర్‌ను అరెస్ట్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి..

Also read

Related posts

Share via