February 3, 2025
SGSTV NEWS
Astro TipsSpiritual

ఈ రోజు నుంచి ఈ రాశుల నుదుటిరాత మారిపోతోంది



చదువుల తల్లి సరస్వతి జన్మదినం ఈనెల రెండోతేదీ ఆదివారం వచ్చింది. అందరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వెంపర్లాడుతుంటారు. ఆమె కనికరిస్తే జీవితం సాఫీగా సాగిపోతుందని నమ్మకం. అయితే సరస్వతీదేవి ఎక్కడ నివసిస్తుందో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. ఆమె దయతో విద్యను సముపార్జించినవారికి డబ్బులు కూడా వచ్చేలా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. వసంత పంచమి రోజు సరస్వతిని పూజించడంవల్ల అన్ని శుభాలు కలుగుతాయి. జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది. జ్ఞానాన్ని ఆర్జించడానికి మార్గం దొరుకుతుంది. రేపటి రోజున ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

వృషభ రాశి

అన్ని పనులు సులువుగా పూర్తవుతాయి. ఊహించనిరీతిలో విజయాలను అందుకుంటారు. ప్రతి పని పూర్తయ్యేందుకు అదృష్టం తోడుంటుంది. విద్యార్థులు తాము అనుకున్న పనుల్లో సులువుగా గెలుపొందుతారు. అన్నీ విజయాలే ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి మంచి లాభాలు కలుగుతాయి. కెరీర్ కు సంబంధించి మంచి వృద్ధిలోకి వస్తారు. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది.




ధనుస్సు రాశి

సమాజంలో గౌరవం పెరుగుతుంది. దీంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మీలోని ప్రతిభను అందరూ గుర్తిస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఒకరకంగా వీరికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. పెళ్లి కానివారికి సంపన్న కుటుంబానికి చెందినవారితో వియ్యం కుదురుతుంది. ఈ సమయం ధనుస్సు రాశివారికి అద్భుతం అని చెప్పొచ్చు. ఏ పని తలపెట్టినా విజయాన్ని సాధిస్తారు.

కర్కాటక రాశి

దీర్ఘకాలికంగా వెంటాడుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో ఎప్పటి నుంచో వస్తున్న సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయి. వీరికి ఆర్థికంగా అనేక లాభాలు కలుగుతాయి. ఒకరకంగా చెప్పాలంటే జీవితంలో సంతోషం పెరుగుతుంది. తలరాత మారిపోతోంది. మనశ్శాంతిగా ఉంటారు. ఆధ్యాత్మిక పనులపట్ల ఆసక్తిగా వాటిల్లో పాల్గొంటారు. వీరికి ఊహించనిరీతిలో ధనలాభం కలుగుతోంది

Related posts

Share via