మరణం.. పుట్టిన ప్రతి ఒక్కరికీ అనివార్యం. మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది.? అనేది ఎవరికీ తెలియదు. మరణించిన తర్వాత ఆత్మ స్వర్గానికి వెళ్తుందని.. లేదా నరకానికి వెళ్తుందని కొందరు అంటుంటే వింటుంటాం. ఈ అంశంలో నిజానిజాలు ఎవరికీ తెలియవు. అయితే, చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఓ బాలిక ఏకంగా ప్రాణాలే తీసుకుంది. తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో (Maharastra) చోటు చేసుకుంది.
గూగుల్ సెర్చ్ చేసి మరీ..
వివరాల్లోకి వెళ్తే.. నాగ్‌పూర్‌కు (Nagpur) చెందిన ఓ బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. మంగళవారం ఆమె తన ఇంట్లోని గదిలో బ్లేడుతో చేయి కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రక్తపు మడుగులో ఉన్న బాలికను చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె గూగుల్ సెర్చ్ చూసి షాకయ్యారు. ‘మరణం తర్వాత ఏం జరుగుతుంది.?’, విదేశీ సంస్కృతుల గురించి బాలిక ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ఎంతోకాలంగా ప్రణాళిక వేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఆన్ లైన్ గేమింగ్‌కు కూడా ఆమె బానిసగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో ఓ కత్తిని ఆర్డర్ చేసుకున్న బాలిక తొలుత తన చేతిని గాయపరుచుకుందని.. అనంతరం మెడను కోసుకుని చనిపోయి ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీ అమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..
- వివాహేతర సంబంధం: భర్తను చంపిన భార్య 10 మంది అరెస్టు
- ప్రియుడి కోసం ఇల్లు వదిలి.. పోలీసుల చేతిలో..!
- రథ సప్తమి విశిష్టత
- భార్యపై అనుమానం.. బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి బ్యాగ్‌తో బయలుదేరిన భర్త.. ఆ తర్వాత..