శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో అర్ధరాత్రి వరుస దొంగతనాలతో దొంగలు హల్చల్ చేశారు. కొత్తచెరువు, ఓబుల దేవర చెరువు మండల కేంద్రాల్లోని దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. రెండు దుకాణాలతో పాటు కిరాణాషాప్ లో నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి (Puttaparthi) నియోజకవర్గంలో బుధవారం అర్ధరాత్రి వరుస దొంగతనాలతో దొంగలు (Thievs) హల్చల్ చేశారు. కొత్తచెరువు , ఓబుల దేవర చెరువు మండల కేంద్రాల్లో నాలుగు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. కొత్తచెరువు ప్రధాన రహదారిపై ఉన్న దర్గా షాపింగ్ కాంప్లెక్స్ లో రెండు దుకాణాలతో పాటు బాబు కిరాణా షాప్ లో రూ. 20 వేల నగదు, రూ.30 వేలు విలువచేసే సిగరెట్లు ఎత్తుకెళ్లారు. సాయినాథ్ షాప్ లో సిగరెట్ బండీల్ తో పాటు రూ. లక్షా యాభైవేల నగదు చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు.
Thieves In Satyasai District
కొత్త చెరువులో ఉన్న దుకాణానికి సంబంధించి షట్టర్ ఓపెన్ చేశారని ఉదయం తెలియగానే పరుగెత్తుకు వచ్చానని బాధితుడు చాంద్ బాషా తెలిపారు. ఇక్కడకు రాగానే మరో దుకాణానికి సంబంధించి షట్టర్ కూడా తెరిచి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న సీఐ ఇందిరా ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ఆధారాలను సేకరించారు.
అదేవిధంగా ఓబుల దేవర చెరువులో అర్ధరాత్రి సమయంలో రెండు దుకాణాలకు సంబంధించి షట్టర్ల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఒక దుకాణంలో రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లిపోయారు. మరో దుకాణంలో చోరీ చేస్తుండగా శబ్ధం కావడంతో దుకాణం పైనే నివాసం ఉంటున్న యజమాని గట్టిగా కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. కాగా శ్రీసత్యసాయి జిల్లాలో ఇటీవల కాలంలో వరుస దొంగతనాలు జరుగుతుండడం తో జనం భయపడిపోతున్నారు.
ఒకేరోజు నియోజకవర్గంలోనాలుగు షాపుల్లో దొంగతనం చేయడంపై ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా ప్రధాన రహదారిపైనే ఉన్న దుఖాణాల్లో అర్ధరాత్రి వరుస దొంగతనాలు చేసి పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు. కాగా వరుస దొంగతనాలు జరగడంపై పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. కేసులు నమోదు చేసి దొంగల కోసం వేట ప్రారంభించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025