ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడుకు చెందిన మాలపాటి అశోక్‌రెడ్డి, సంధ్య అన్నాచెల్లెళ్లు.. సంధ్య (25) కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా ఉంటోంది.. పునుగోడులోని తన అన్న అశోక్‌రెడ్డితో కలిసి ఉంటోంది. అశోక్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అప్పులు చేసి పీకల్లోతు ఆర్దిక కష్టాల్లో ఉన్నాడు..ఈ క్రమంలోనే.. దారుణానికి పాల్పడ్డాడు..
కనురెప్పే కాటేసింది.. రక్షించాల్సిన సోదరుడే కర్కశంగా చంపేశాడు.. అదీ ప్లాన్ చేసి మరీ హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల వెనక్కి వెళ్ళాడు… ప్రకాశంజిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన డబ్బుకోసం రక్తసంబంధాలను కలుషితం చేసేలా మారిందనడానికి ఉదహారణగా నిలిచింది. బీమా సంస్థల నుంచి క్లైం పొందేందుకు సొంత చెల్లెలను హత్యచేసిన ఘటన గతేడాది ఫిబ్రవరి 24న ప్రకాశం జిల్లా కాటూరివారిపాలెం సమీపంలో చోటుచేసుకొంది. 1.13 కోట్ల పరిహారం కోసం ఈ ఘాతుకానికి సొంత అన్నేచెల్లెల్ని చంపాడని తేలింది. అప్పట్లో రోడ్డుప్రమాదంగా ఈ కేసు నమోదైంది. అయితే అనంతరం పోలీసుల విచారణలో ఇది హత్యగా తేలింది. ఆ కేసు సంబంధించి వివరాలను పొదిలి సీఐ వెంకటేశ్వర్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడుకు చెందిన మాలపాటి అశోక్‌రెడ్డి, సంధ్య అన్నాచెల్లెళ్లు.. సంధ్య (25) కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా ఉంటోంది.. పునుగోడులోని తన అన్న అశోక్‌రెడ్డితో కలిసి ఉంటోంది. అశోక్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అప్పులు చేసి పీకల్లోతు ఆర్దిక కష్టాల్లో ఉన్నాడు. ఒకవైపు భర్తకు దూరమై తన ఇంట్లో ఉన్న చెల్లెలు, మరోవైపు ఆర్ధిక ఇబ్బందులు అశోక్‌రెడ్డిని రాక్షుసుడిలా మార్చాయి. ఇటు చెల్లెల్ని వదిలించుకోవడమే కాకుండా ఆర్ధికంగా లబ్ది పొందవచ్చన్న దురాలోచనలతో పన్నాగం పన్నాడు..
చెల్లెలి పేరుతో పలు ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఆమెకు 1.13 కోట్ల రూపాయల వరకు జీవిత భీమా చేయించాడు. ఆపై ఆమెను చంపేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తే భీమా సొమ్ముతో అప్పులు తీర్చేయవచ్చన్న కుట్ర పన్నాడు. అనుకుందే తడవుగా ప్లాన్ అమల్లో పెట్టాడు.. అనారోగ్యంతో బాధపడుతున్న తన చెల్లెల్ని ఒంగోలులోని ఆసుపత్రిలో చికిత్స పేరుతో తీసుకెళ్ళాడు. ఏడాది క్రితం 2024 ఫిబ్రవరి 4న ఒంగోలులోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. తిరిగి స్వగ్రామం కనిగిరి మండలం పునుగోడుకు వచ్చే క్రమంలో దారి మద్యలో చెల్లెలు సంధ్యకు మత్తుబిళ్ళలు ఇచ్చి ఆపస్మారక స్థితికి వెళ్ళేలా చేశాడు. అనంతరం మార్గమధ్యంలో పొదిలి మండలం కాటూరివారిపాలెం దగ్గర కారును చెట్టుకు ఢీకొట్టి యాక్సిడెంట్ అయినట్టు మభ్యపెట్టాడు. మత్తులో ఉన్న చెల్లెలు గొంతునులిమి చంపేశాడు.. తనకు స్వల్ప గాయాలయ్యాయని గుంటూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరాడు.
ఆ భయమే పట్టించింది..
కారు యాక్సిడెంట్‌లో తన చెల్లెలు సంధ్య చనిపోయినట్టు నమ్మబలికిన అశోక్‌రెడ్డి ఆ తరువాత పోస్టుమార్టంలో అసలు నిజం బయటపడుతుందని భయపడ్డాడు… తన స్నేహితుడు మాలకొండారెడ్డికి ఈ విషయం చెప్పి సాయం చేయమని కోరాడు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం తన చెల్లెలు సంధ్య యాక్సిడెంట్ కారణంగా చనిపోయిందని చిత్రీకరించేందుకు పోస్టుమార్టం విధుల్లో ఉన్న ఆసుపత్రి ఉద్యోగికి 3 లక్షలు లంచం ఇచ్చాడు. అనుకున్న ప్రకారం సంధ్య అవయవాలను మార్చి రిపోర్ట్ పంపేలా చేశాడు. అయితే ఈ అవయవాల రిపోర్ట్‌ను ఇచ్చేందుకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్న కారణంగా వైద్యులు తాత్సారం చేశారు. కొన్నాళ్ళు గడిచిన తరువాత పోస్టుమార్టం రిపోర్ట్ కోసం అశోక్‌రెడ్డి వైద్యులను వత్తిడి చేయడం ప్రారంభించాడు.
అశోక్‌రెడ్డి ప్రవర్తనపై పోస్టుమార్టం చేసే వైద్యులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అశోక్‌రెడ్డిపై నిఘాపెట్టారు. అశోక్‌రెడ్డికి తెలియకుండా విచారణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో అశోక్‌రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా భీమా డబ్బుల కోసం చెల్లెల్ని హత్యచేసినట్లు తేలడంతో అశోక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అశోక్‌రెడ్డికి సహకరించిన అతని స్నేహితుడు మాలకొండారెడ్డి, లంచం తీసుకున్న ఆసుపత్రి ఉద్యోగి యూసుఫ్‌ల కోసం గాలిస్తున్నట్టు పొదిలి సిఐ టి. వెంకటేశ్వర్లు తెలిపారు
Also read
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!
- Srikakulam District: ఏం మహానటివి అమ్మా… భర్తను లేపేసి భలే నాటకం
- Kolkata: ఆర్జీ కర్ ఆసుపత్రి విద్యార్ధిని ఆత్మహత్య
- కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీ అమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..