April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Ram Gopal Varma: ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల నోటీసులు.. వర్మ రియాక్షన్ ఏంటంటే…?

 

వర్మ నువ్వు రావాలయ్యా…. ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల నోటీసులు… ఫిబ్రవరి 7న విచారణకు రావాలని వాట్సప్‌ సందేశం… వస్తానన్న వర్మ… సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కు నోటీసులు జారీ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు.. ఫిబ్రవరి 7వ తేదీన విచారణకు హాజరు కావలసిందిగా వాట్సప్ ద్వారా నోటీసులు పంపిన ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు.


సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ప్రకాశంజిల్లా పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు… ఫిబ్రవరి 7వ తేదీన విచారణకు హాజరు కావలసిందిగా వాట్సప్ ద్వారా నోటీసులు పంపించారు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు… వ్యూహం సినిమా ప్రచారంలో భాగంగా చంద్రబాబు, లోకేష్ ల ఫోటోలు మార్ఫింగ్ చేసి అవమానకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారన్న ఫిర్యాదు పై మద్దిపాడు పీఎస్ లో 2024 నవంబర్‌ 10 తేదిన రాంగోపాల్ వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే… ఈ కేసులో వర్మకు ఇప్పటికే బెయిల్‌ మంజూరైంది… అయితే తాజాగా ఈ కేసులో విచారణ పెండింగ్‌లో ఉన్నందున ఫిబ్రవరి 7న ఒంగోలు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని ఈ కేసు విచారణాధికారిగా ఉన్న ఒంగోలు రూరల్‌ సిఐ శ్రీకాంత్‌బాబు తాజాగా వర్మకు వాట్సప్‌ ద్వారా నోటీసులు పంపారు.


గతంలో ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం చంద్రబాబు, లోకేష్‌ల ఫోటోలు మార్ఫింగ్‌ చేసి ఎక్స్ లో పెట్టిన పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ప్రకాశంజిల్లా మద్దిపాడు టిడిపి నేత రామలింగం వర్మపై చేసిన ఫిర్యాదు పై 2024 నవంబర్‌ 10న మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేఉశారు… ఈ కేసులో నవంబర్‌ 19న తొలిసారి, 25న రెండోసారి విచారణకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా , వర్మ రాకపోవడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు… అయితే తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టులో రిట్ వేశారు వర్మ… రిట్ పై వాదోపవాదాలు జరిగిన తరువాత ఎట్టకేలకు వర్మకు ముందస్తు బెయిల్‌ లభించింది… దీంతో పోలీసులు కొన్నాళ్ళు మిన్నకుండిపోయారు…

ఫిబ్రవరి 7వ తేదీన విచారణకు హాజరు కావలసిందిగా ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు వాట్సప్‌ ద్వారా పంపిన నోటీసులకు రాంగోపాల్‌వర్మ స్పందించారు… తాను ఫిబ్రవరి 7న తప్పుకుండా విచారణకు హాజరవుతానని వాట్సప్‌ ద్వారా సిఐ శ్రీకాంత్‌బాబుకు రిప్లై ఇచ్చారు… గతంలో విచారణకు రావాలని ఇచ్చిన నోటీసులకు పలు కారణాలు చెప్పి రాకుండా కోర్టులను ఆశ్రయించిన వర్మ బెయిల్ పొందిన తరువాత విచారణకు వస్తానని చెప్పడం విశేషం… గతంలో ఇచ్చిన నోటీసులు వర్మను అరెస్ట్‌ చేసేందుకు ఉద్దేశించినవి కావడంతో వర్మ విచారణకు హాజరుకాలేదని భావిస్తున్నారు… ప్రస్తుతం వర్మకు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో ఫిబ్రవరి 7న విచారణకు హజరవుతానని వర్మ పోలీసులకు సమాధానం పంపారు

Also read

Related posts

Share via