*
*సినీ వీడియో సాంగ్ రిలీజ్…*
అమరావతి:
గుంటూరు నగరంలో రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య వేదిక కార్యాలయంలో మంగళవారం *రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ చేతుల మీదుగా చలపతి కళాశాల విద్యార్థులు సినీ రీమేక్ వీడియో పాటను ప్రారంభింప చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ* విద్యార్థులలో చదువుతోపాటు అదనంగా తాము ఎంచుకున్న వృత్తిలో తమలో ఉన్న ప్రతిభాపాటవాలను వెలికి తీసే విధంగా నైపుణ్యత సాధించాలని, గుంటూరు ప్రాంతం నుంచి సినీరంగంలో నటులుగా దర్శకులుగా, నిర్మాతలుగా, గాయకులుగా, దర్శకులుగా ఎంతోమంది సినీ రంగంలో ప్రవేశించి తమ నైపుణ్యతను చాటుకున్నారని, ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారనీ, అలానే ఈ విద్యార్థులు కూడా “గుంటూరు మిర్చి” సంస్థ పేరుతో నూతన రాజధాని ప్రాంతాల్లో షార్ట్ ఫిలింలు దర్శకత్వం వహిస్తూ తమ ప్రతిభాపాటవాలు చాటుకుంటున్నారని, వీరు కూడా భవిష్యత్తులో సినీరంగంలో సందేశాత్మక, సృజనాత్మక చిత్రాలను తీసి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఇలాంటి వారిని చూసి మిగతా విద్యార్థులు కూడా వారెంచుకున్న రంగాల్లో తమ ప్రతిభ పాఠవాలు నిరూపించుకునే విధంగా సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ఈ తరానికి తగ్గట్టుగా విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగించి ఖ్యాతిగాడించాలని శ్రీధర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చలపతి ఇంజనీరింగ్ కళాశాల(లాం) విద్యార్థులు నంద్యాల భార్గవ్ (బన్నీ) ఆధ్వర్యంలో డైరక్షన్ లో విద్యార్థి సిసింద్రీ,బన్నీ నటించిన సినీ రీమేక్ వీడియో (గుమ్మా) పాటను,పోస్టర్ ను శ్రీధర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల భార్గవ్ (బన్నీ),సిసింద్రీ మరియు చిలుమూరు సుదీర్ స్థానిక కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Also read
- India-Pakistan War: మారని పాక్ వక్రబుద్ధి.. మళ్లీ మొదలైన యుద్ధం! జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డ పాక్
- Andhra News: రోడ్డుపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి.. అప్రమత్తమై పీఎస్‌కు తరలించిన పోలీసులు!
- Pak Drone Attack: మళ్ళీ భారత్ పై పాక్ డ్రోన్ అటాక్..? ఎంతవరకు నిజం?
- India-Pakistan: యుద్ధం ఆగింది సరే.. నెక్స్ట్ ఏంటి..? ప్రధాని మోదీ కీలక సమావేశం..
- India Pak Ceasefire: మసీదులను టార్గెట్ చేసినట్లు భారత్‌పై.. పాక్ తప్పుడు ప్రచారం చేసింది: కమాండర్ వ్యోమికా