March 12, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. మరుసటి రోజు ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..



బైక్.! ఆ బైక్ కీ రెండు కనిపించాయి. చుట్టుపక్కల చూశాడు ఎవరూ లేరు. ఇంకేముంటుంది.. క్షణాల్లో ద్విచక్ర వాహనాన్ని తీసుకొని అక్కడి నుంచి మాయం అయ్యాడు. ఇదంతా రొటీన్..! కానీ ఆ దొంగ మాత్రం అలా చేయలేదు. మరునాడు అదే బైక్‌ను అదే ప్లేస్‌లో వదిలి వెళ్లాడు. వినడానికి కొంత వింతగా ఉన్నా జోగుళాంబ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.


వనపర్తి జిల్లాకు చెందిన గొర్రెల పెంపకందారుడు మన్యం పని మీద బైక్ తీసుకొని పక్కనే ఉన్న జోగుళాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాకు వచ్చాడు. చౌరస్తాలోని ఓ చికెన్ సెంటర్‌లో చికెన్ తీసుకోవడానికి వెళ్లాడు. అయితే చికెన్ షాప్ ముందు బైక్‌ను తాళంతో పాటే నిలిపాడు. ఇది గమనించిన ఓ దొంగ మన్యం చికెన్ కొట్టించుకొని వచ్చేలోపే బైక్‌తో సహా ఉడాయించాడు. చుట్టుపక్కల స్థానికులను విచారించగా బైక్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం దొరకలేదు. చివరికి ఉండవల్లి పోలీసులను ఆశ్రయించాడు మన్యం. చికెన్ కోసం పోతే బైక్ పోయిందన్న బెంగతో మన్యం స్వగ్రామానికి వెళ్లిపోయాడు.


రాత్రి గడిచిందో లేదో ఉదయాన్నే మన్యంకు పోలీసుల నుంచి తీపికబురు అందింది. చోరీకి గురైందనుకున్న బైక్ దొరికిందని సమాచారం ఇచ్చారు. అయితే రాత్రికి రాత్రే మన్యం బైక్‌ను ఎక్కడైతే తస్కరించాడో అక్కడే అలానే వదిలివెళ్లాడు. ఉదయం చికెన్ షాపు ఓపెన్ చేద్దామని వచ్చిన యాజమాని వెంకట్రావ్‌కు షాప్ ముందు బైక్ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. చికెన్ తీసుకునేందుకు మన్యం బైక్‌ను నిలిపి ఎలా వెళ్లాడో అదే మాదిరిగా దొంగ సైతం బైక్‌కు కీని అలానే ఉంచి అదే ప్లేస్‌లో పార్కింగ్ చేసి వెళ్లాడు.

ఇక పోలీసుల సమాచారంతో అలంపూర్ చౌరస్తాకు చేరుకున్న మన్యం పోయిందనుకున్న బైక్‌ను చూసి మురిసిపోయాడు. ఉండవల్లి పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్స్ అబ్దుల్ బాషా, నగేశ్‌లు మన్యంకు బైక్‌ను అప్పజెప్పారు. దొంగతనానికి గురైన బైక్ గంటల వ్యవధిలోనే దొరకడంతో గొర్రెల పెంపకందారుడు మన్యం ఆనందంతో మునిగిపోయాడు. బైక్ దొరికింది కానీ దొంగిలించిన దొంగ మాత్రం చిక్కకపోవడం కొసమెరుపు

Also read

Related posts

Share via