February 3, 2025
SGSTV NEWS
CrimeNational

Kolkata Rape case: జూనియర్ డాక్టర్‌ రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు.. సంజయ్ కి జీవిత ఖైదు!


కోల్‌కతా జూనియర్ డాక్టర్‌ అత్యాచారం కేసులో సీల్దా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషి సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించింది. అలాగే రూ.50వేల జరిమానా వేసింది. బాధిత కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.

Kolkata Rape case: కోల్‌కతా జూనియర్ డాక్టర్‌ అత్యాచారం కేసులో సీల్దా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషి సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించింది. అలాగే రూ.50వేల జరిమానా వేసింది. బాధిత కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో 102 మంది సాక్షుల వాగ్మూలం సేకరించింది న్యాయస్థానం. సంజయ్ ని మరణించే వరకు జైలులోనే ఉంచాలని స్పష్టం చేసింది. అయితే తమకు పరిహారం అవసరం లేదని, న్యాయం కావాలని బాధిత కుటుంబం చెబుతోంది.

ఈ మేరకు సోమవారం కోల్‌కతా డాక్టర్‌ అత్యాచారం కేసులో సీల్దా కోర్టులో ఇరువైపుల వాదనలు ముగిశాయి.  దోషి సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష సరైనదని సీబీఐ లాయర్ కోర్టు ముందు  వాదించారు. అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి గరిష్ఠ శిక్షను విధించాలని ప్రార్థిస్తున్నట్లు న్యాయస్థానానికి విన్నవించారు. మరొకరు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండేలా తీర్పు ఉండాలన్నారు. పీజీ మెడిసిన్ చేస్తూ ఐపీఎస్  కావాలనుకున్న యువతి జీవితం, కలలను సంజయ్ చెరిపేశాడని సీబీఐ లాయర్ కోర్టు ముందు వాదించారు. అయితే తాను తప్పు చేయలేదని దోషి సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాపోయాడు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నాడు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు మధ్యాహ్నం గం.2:45కి తీర్పు వెల్లడించింది.

ట్రైనీ డాక్టర్‌పై అఘాయిత్యం..
కాగా ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సక్రమంగా విచారించలేదని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసును సీబీఐ సక్రమంగా విచారించి ఉంటే మరికొంత మందిని అరెస్టు చేసి దోషులుగా నిర్ధారించి ఉండేవారని పేర్కొన్నారు.  2024 ఆగస్టు 9న ఆర్జీకర్‌ మెడికల్‌ కళాశాలలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై.. పోలీస్‌ వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌ రాయ్‌ అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సంజయ్‌ రాయ్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి. చివరికి ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది

అసలు ఎలా జరిగిందంటే..
2024, ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్.. ఆర్‌జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీలో ఉంది. బాధితురాలు భోజనం చేసిన అనంతరం విశ్రాంతి తీసుకోవడానికి చెస్ట్ డిపార్ట్‌మెంట్ సెమినార్ హాల్‌కు వెళ్లింది. ఆ తర్వాత శవమై కనిపించింది. అత్యంత దారుణమైన స్థితిలో మృతదేహం ఉండడం అందరినీ కలచివేసింది. విచారణ చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు విచారించారు.

నేను ఏ తప్పు చేయలేదు..
నిందితుడు  సంజయ్ రాయ్‌ కోర్టులో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు..  తాను నిర్దోషిని కోర్టులో చెప్పుకొచ్చాడు.  తనతో పోలీసులు  బలవంతంగా సంతకం చేయించారని తెలిపాడు. తాను రుద్రాక్షమాల ధరిస్తానని…  తాను తప్పు చేసి ఉంటే రుద్రాక్ష పూసలు తెగిపోయి ఉండాలన్నాడు.  తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని..  నేరానికి పాల్పడినట్టు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారని  తెలిపాడు. తనను ఓ ఐపీఎస్ అధికారి ఇందులో ఇరికించాడంటూ సంచలనల ఆరోపణలు చేశాడు. ఒకవైపు తాను తప్పు చేయలేదు అంటూనే తనకు మారే అవకాశం ఇవ్వాలని సంజయ్ రాయ్‌ కోర్టును కోరారు.

ఉరిశిక్ష కాకుండా మరెదైనా శిక్షను విధించాలని కోరాడు.  మరికాసేపట్లో కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ఇక అతనికి ఉరిశిక్షనే సరైనదని సీఎం మమతా బెనర్జీ సైతం ట్వీట్ చేశారు. అయితే ఉరిశిక్ష వేయాలన్న డిమాండ్ ను  సంజయ్ రాయ్‌ న్యాయవాది తొసిపుచ్చారు. 

Also read

Related posts

Share via