February 4, 2025
SGSTV NEWS
CrimeTelangana

Khammam: కిడ్నాప్ కేసు విషాదాంతం.. శవమై తేలిన సంజయ్, గ్రామస్థుల ఆందోళన


ఖమ్మం యువకుడి కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. పోలెపల్లికి చెందిన సంజయ్‌ను దుండగులు చంపేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ కుటుంబసభ్యులు, స్నేహితులు ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.

Khammam: ఖమ్మం యువకుడి కేసు విషాదాంతమైంది. పోలెపల్లికి చెందిన సంజయ్‌ను దుండగులు చంపేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ కుటుంబసభ్యులు, స్నేహితులు ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. మరణానికి కారణం తెలిసేవరకు కదలమని, సీఎం రేవంత్, భట్టి విక్రమార్క న్యాయం చేయాలని కోరుతున్నారు.
పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే..
ఈ మేరకు అన్న సాయిని రిసీవ్ చేసుకునేందుకు ఖమ్మం కొత్త బస్టాండ్ వెళుతున్న సంజయ్‌ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్వకట్టపై అడ్డగించి  చంపేశారు. దీంతో సంజయ్‌ కుటుంబసభ్యులు, స్నేహితులు, కరుణగిరి కాలనీ వాసులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంజయ్ మృతికి గల కారణాలను వెల్లడించాలని, పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీవాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు

అసలేం జరిగిందంటే..  ఖమ్మం పోలెపల్లి రాజీవ్ గృహ కల్పలో బాధితుడు సంజయ్ కుమార్ కుటుంబం నివాసం ఉంటోంది. అయితే సంజయ్ అన్న సాయి హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకోసం సోమవారం సాయంత్రం ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలోనే తాను ఖమ్మం కొత్త బస్టాండ్ లో దిగేవరకు రాత్రి 1:30 అవుతుందని ఆ సమయంలో తనను రిసీవ్ చేసుకోవడానికి రావాలని తమ్ముడు సంజయ్ కి ఫోన్ చేశాడు. దీంతో 1గంటకు ఖమ్మం బయలు దేరిన సంజయ్.. మార్గమధ్యలో తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, అన్నా నన్ను చంపేస్తారంటూ సాయికి వాట్సప్ లో వాయిస్ మెసేజ్ పంపించాడు. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి గాలించారు. చివరికి మూడు రోజులకు చెరువులో శవమై తేలాడు.

Also read

Related posts

Share via