వరంగల్ : ఆన్ లైన్ బెట్టింగ్‌కు యువకుడు బలైన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో లైశెట్టి భాగ్యలక్ష్మి- కుమారస్వామిల మూడవ కొడుకు లైశెట్టి రాజు కుమార్ (26) డిగ్రీ పూర్తి చేసుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఈక్రమంలో … ఆన్ లైన్ బెట్టింగు మోజులోపడి సుమారు 30 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. గత వారం రోజులుగా తనకు 4 లక్షల రూపాయలు కావాలని తండ్రిని రాజు కుమార్ వేధించాడు. అయితే యువకుడికి తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో చాలాసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉదయం ఇంటికి తాళం వేసి తండ్రి బయటకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఇంటికి వచ్చి చూసేసరికి కుమారుడు విగతజీవిగా కనిపించడంతో రోదించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!