February 4, 2025
SGSTV NEWS
CrimeNational

పెళ్లికి సహాయం చేస్తానని పిలిచి..

శివాజీనగర: అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై వ్యాపారి, మాజీ బీజేపీ నాయకుడు సోమశేఖర్ జయరాజ్ (జిమ్ సోమ)పై అశోక్ నగర పోలీస్ స్టేషన్లో ఎస్ఐఆర్ నమోదైంది. ఆర్థిక సహాయం చేస్తానని పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డారని 26 సంవత్సరాల బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారురాలికి తన స్నేహితురాలి ద్వారా సోమశేఖర్ పరిచయం అయ్యాడు.

గత సంవత్సరం వివాహం నిర్ణయం కావటంతో రూ. 6 లక్షల ఆర్థిక సహాయం చేయాలని సోమశేఖర్ను బాధితురాలు కోరింది. గత అక్టోబర్ లో డబ్బు ఇస్తానని చెప్పి లాంగ్ ఫోర్ట్ రోడ్డులో ఉన్న తన ప్లాట్కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తానని సోమశేఖర్ బెదిరించినట్లు బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా పరారీలో ఉన్న సోమశేఖర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సకలేశపుర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోమశేఖర్… జేడీఎస్కు చెందిన హెచ్.కే.కుమారస్వామి చేతిలో ఓటమిపాలయ్యాడు.

Also read

Related posts

Share via