నవ గ్రహాల అధినేత.. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు నెలకి ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెడతాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెట్టిన రోజుని మకర సంక్రాంతి పండగగా జరుపుకుంటారు. ఈ ఏడాది సూర్యుడు మకరరాశిలోకి జనవరి 14 న ప్రవేశిస్తాడు. ఆ తర్వాత కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది. అన్ని రంగాలలో లాభాలను పొందనున్నారు. ఈ రోజు మకర సంక్రాంతి తర్వాత ఏ రాశులవారికి మంచి రోజులు ప్రారంభం అవుతాయో ఈ రోజు తెలుసుకుందాం.
మకర సంక్రాంతి హిందూ మతంలో ఒక ప్రధాన పండుగ. సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజున ఈ పండుగను జరుపుకుంటారు. మకర సంక్రాంతి రోజున స్నానం చేసి దానం చేసే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ రోజున నదీ స్నానం చేసి దానం చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజు నువ్వుల లడ్డూలు, పరమాన్నం తినే సంప్రదాయం కూడా ఉంది. ఈ రోజున పాలతో చేసిన పరమాన్నం తినడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
ఈ ఏడాది జనవరి 14న సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జనవరి 14వ తేదీ ఉదయం 9.03 గంటలకు మకర రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు. ఈ రోజున ప్రజలు పవిత్ర నదులలో స్నానం చేసి శక్తి కొలదీ దానం ఇచ్చి సూర్య భగవానుని పూజిస్తారు. సూర్యుడికి నువ్వుల లడ్డూలను నైవేద్యంగా సమర్పించనున్నారు. ఈ రోజున సూర్య భగవానుడికి నువ్వుల లడ్డూలను నైవేద్యంగా సమర్పించడం వలన సూర్యుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
మకర సంక్రాంతి రోజున మకరరాశిలో సూర్య భగవానుడి సంచారము జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న మొత్తం 12 రాశుల ప్రజలను ప్రభావితం చేస్తుంది. అయితే మకర సంక్రాంతి తర్వాత కొన్ని రాశుల వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఈ రాశుల వారు ఏ పని చేపట్టినా విజయాన్ని పొందుతారు. ఈ రాశులు ఏవో తెలుసుకుందాం.
మేష రాశి: జనవరి 14వ తేదీ అంటే మకర సంక్రాంతి తర్వాత మేష రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. వైవాహిక జీవితంలో వీరికి జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. భూమి, భవనం, వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల వలన అపారమైన ఆనందాన్ని పొందుతారు.
సింహ రాశి: మకర సంక్రాంతి తరువాత సింహ రాశికి చెందిన వ్యక్తులకు అన్నింటా అదృష్టమే.. మకర సంక్రాంతి తర్వాత వీరి శ్రమ ఫలిస్తుంది. వ్యాపారస్తుల వ్యాపారంలో పెరుగుదల ఉండవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది.
మకర రాశి: మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తాడు. అటువంటి పరిస్థితిలో మకర సంక్రాంతి తర్వాత వచ్చే సమయం మకర రాశి వారికి చాలా మంచిదని భావిస్తారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు తీరుతాయి. కెరీర్‌లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి.
వృశ్చిక రాశి: సూర్యభగవానుడు మకరరాశిలో సంచరించిన తర్వాత వచ్చే సమయం వృశ్చిక రాశి వారికి వరం కంటే తక్కువ కాదు. కోరుకున్న విజయాన్ని సాధిస్తారు. ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే విజయం సాధిస్తారు
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!