విజయవాడ.. హైదరాబాద్ హైవే.. వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంది.. వేలాది వాహనాలు వస్తున్నాయి.. పోతున్నాయి.. అయితే.. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ కారు రయ్యిరయ్యిన దూసుకువస్తోంది.. ఈ క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆపేందుకు ప్రయత్నించారు.. కానీ.. కారు మాత్రం ఆగలేదు.. అదే స్పీడుతో డ్రైవర్ వెనుకకు తిప్పడంతో పోలీసుల అనుమానం మరింత పెరిగింది..
విజయవాడ.. హైదరాబాద్ హైవే.. వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంది.. వేలాది వాహనాలు వస్తున్నాయి.. పోతున్నాయి.. అయితే.. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ కారు రయ్యిరయ్యిన దూసుకువస్తోంది.. ఈ క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆపేందుకు ప్రయత్నించారు.. కానీ.. కారు మాత్రం ఆగలేదు.. అదే స్పీడుతో డ్రైవర్ వెనుకకు తిప్పడంతో పోలీసుల అనుమానం మరింత పెరిగింది.. కారు ఆగకుండా దూసుకెళుతుండటంతో పోలీసులు.. కూడా తమ వాహనాలతో వెంబడించారు.. చివరకు కారు ఓ ఊరిలోకి ప్రవేశించింది.. దానిలో ఉన్న వ్యక్తులు.. నివాస ప్రాంతాల్లో కారును వదిలేసి పారిపోయారు.. కారు దగ్గరకు వెళ్లిన పోలీసులు.. దానిలో ఏముందా అని చెక్ చేశారు.. డిక్కిని ఓపెన్ చేసి ఒక్కసారిగా షాకయ్యారు.. కారులోంచి భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన NTR జిల్లా జగ్గయ్యపేట పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
విజయవాడ హైదరాబాద్ హైవే పై కారులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో ఎన్టీఆర్ జిల్లా గౌరవరం వద్ద నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు ప్రారంభించారు.. ఈ క్రమంలో పోలీసులను చూసి కారు డ్రైవర్ ఆకస్మాత్తుగా కారును ఆపాడు.. అనంతరం గౌరవరం గ్రామంలోకి కారును తిప్పి డ్రైవర్ తప్పించుకోబోయాడు.. దీంతో పోలీసులు ఛేజ్ చేసి కారును పట్టుకున్నారు.. ఈ క్రమంలో కారు వదిలి దుండగులు పరారయ్యారు.
అనంతరం కారును పోలీసులు చెక్ చేశారు.. కార్ డిక్కీ తెరచి చూడగా గంజాయ్ పట్టుబడింది.. కారులో పార్సిల్ చేసిన 70 కిలోల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని.. గంజాయ్ దందా గురించి ఆరాతీస్తున్నామని పోలీసులు తెలిపారు
Also Read
- ఈ ఆలయంలో మీ ప్రశ్న నిజమైతే ‘శిల’ తిరుగుతుంది! – ‘శివాజీ’ యుద్దానికి వెళ్లేముందు ఇక్కడికి వచ్చేవారట!
- సముద్రపు అలలు చేసే శివాభిషేకం.. పాండవులు ప్రతిష్ఠించిన 5 శివలింగాల ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భూమి నుంచి ఆకాశం వరకు పరమశివుని పంచభూత క్షేత్రాలు.. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే!
- Hyderabad: ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం.. గంజాయి మత్తులో యువకుల హల్చల్
- మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న భర్త అరాచకం




