February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: వేధిస్తున్న వ్యక్తికి నడిరోడ్డు మీద చుక్కలు చూపించిన యువతి..!



ఫోన్ నెంబర్ కావాలంటూ కొద్దిరోజులుగా వెంటపడుతున్నాడు. తన వెంట పడొద్దని చెప్పినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. చాలా సహనంతో అతడి చేష్టలను భరించిన యువతి చివరకు అతడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. వేధింపులు భరించలేక యువతి కుటుంబ సభ్యులతో కలిసి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసింది.

అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని ఓ యువతి చితకబాదింది. రోడ్లపై వెళ్తున్న మహిళల ఫోన్ నంబర్లు అడుగుతూ, అసభ్యంగా మాట్లాడుతుండగా అది చూసిన ఓ యువతి సరైన రీతిలో బుద్ధి చెప్పింది. ఏడుస్తూ పారిపోకుండా వేధించిన వ్యక్తిని బుద్ధి చెబుతూ చితకబాదింది. భయపడకుండా వేధించిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన వీడియో వైరల్ అవుతోంది. లేడీస్ సింహల గర్జించిన ఆ యువతి ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఓ యువతి కుటుంబం ఇడ్లీ బండి నడిపిస్తున్న జీవనం సాగిస్తున్నారు. కొండమల్లేపల్లిలో ఉండే వ్యక్తి కొద్దిరోజులుగా యువతిని అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడు. ఫోన్ నెంబర్ కావాలంటూ కొద్దిరోజులుగా వెంటపడుతున్నాడు. తన వెంట పడొద్దని చెప్పినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. చాలా సహనంతో అతడి చేష్టలను భరించిన యువతి చివరకు అతడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. తన కుటుంబ సభ్యులు, బంధువులకు వేధింపుల విషయాన్ని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులతో కలిసి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భయపడకుండా తనను వేధించిన వ్యక్తికి దేవ శుద్ధి చేసిన యువతి తీరు పట్ల నెటిజెన్లు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి

Related posts

Share via