February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshTrending

Andhra News: పల్నాడులో బయటపడిన శాసనాలు.. వెలుగులోకి వందల ఏళ్లనాటి రహస్యం..!

పల్నాడులో కాకతీయుల నాటి శాసనాలు బయటపడింది. చారిత్రక ఆనవాళ్లను చరిత్రకారులు కాపాడుకోవాలంటున్నారు. పల్నాడు జిల్లా రొంపిచర్లలోని వినాయక ఆలయం ఎదుట క్రీశ 1320, 1245 నాటి శాసనాలు బయటపడ్డాయి. అయితే ఈ శాసనాలను స్థానికులు గుర్తించారు. వీటిని భద్రపరచుకోవలసిన అవసరం ఉందని ప్లీచ్ ఇండియా అధ్యక్షుడు ఈమని శివనాగిరెడ్డి అన్నారు


పల్నాడు జిల్లా రొంపిచర్లలోని వినాయక ఆలయం ఎదుట క్రీశ 1320, 1245 నాటి శాసనాలు బయటపడ్డాయి. అయితే ఈ శాసనాలను స్థానికులు గుర్తించకపోవడంతో ఆలనా పాలనా లేకుండా పడి ఉన్నాయి. వీటిని భద్రపరచుకోవలసిన అవసరం ఉందని ప్లీచ్ ఇండియా అధ్యక్షుడు ఈమని శివనాగిరెడ్డి అన్నారు. పల్నాడు ప్రాంతంలో పలు చోట్ల కాకతీయుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అయితే వాటిని గుర్తించి చరిత్రను తెలుసుకోవాల్సిన వారు అంతగా పట్టించుకోవడం లేదన్నారు.

క్రీశ 1320 నాటి గణపతి దేవుని శాసనంలో అనంత గోపినాథ దేవుని కొలువులకు రెడ్ల చెరువు వెనుక కొంత భూమిని దానం చేసినట్లు ఉందని ఆయన తెలిపారు. ఇక క్రీశ 1245 నాటి కోట భీమరాజు మంత్రి వల్లభుడు రొంపిచర్లలో కట్టించిన గోపినాథ ఆలయానికి కొంత భూమిని దానం చేసిన వివరాలు ఉన్నాయన్నారు. అయితే ఈ రెండు శాసనాల ద్వారా కాకతీయులు పాలన పల్నాడు కొనసాగినట్లు తెలుస్తుందన్నారు. వీటితో పాటు క్రీశ 10వ శతాబ్దానికి చెందిన మహిషాసుర మర్థని, బ్రహ్మ, నంది విగ్రహాలు రోడ్డు వెంట పడి ఉన్నాయని చెప్పారు. వీటి చుట్టూ గడ్డి పెరిగిపోయి అక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు.

గ్రామంలోని వేణుగోపాల స్వామి గుడి సమీపంలో చారిత్రిక ఆనవాళ్లు అనేకం ఉన్నాయని వాటిని సేకరించి భద్రపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సరైన అవగాహన లేకపోవడంతో స్థానికులు పట్టించుకోవడం లేదన్నారు. రొంపిచర్ల గ్రామానికి విశిష్ణ చరిత్ర ఉన్నట్లు ఈ చారిత్రిక ఆనవాళ్ల ద్వారా అర్దమవుతుందని వీటిని కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత స్థానిక యువకులపై ఉందన్నారు

Also Read

Related posts

Share via