నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు హిజ్రాను ప్రేమించాడనే మనస్తాపంతో తల్లిదండ్రులు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. దంపతులిద్దరూ మృతి చెందారు.
Nandyal District: సాధారణంగా కన్నబిడ్డల ప్రేమ తల్లిదండ్రులు బతికిస్తుందని చెబుతారు. కానీ ఆ కన్నబిడ్డ ప్రేమే వారి ప్రాణం తీయడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ విషాదకరమైన ఘటన ఆంద్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది
హిజ్రాను ప్రేమించాడని
నంద్యాల జిల్లా SBI కాలనీలో సుబ్బరాయుడు,సరస్వతి దంపతులకు సునీల్ అనే కొడుకు ఉన్నాడు. అయితే కొడుకు సునీల్ ఒక హిజ్రాను ప్రేమించాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు సుబ్బారాయుడు, సరస్వతి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది… అప్పటికే పరిస్థితి విషమించడంతో దంపతులిద్దరూ మృతి చెందారు.
Also Read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..