ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లి, ఇద్దరు పిల్లలు మృత్యువాతపడిన విషాద ఘటన మహబూబ్నగర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నవాబ్పేట, : ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లి, ఇద్దరు పిల్లలు మృత్యువాతపడిన విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్పేట మండలం పోమాల్ గ్రామానికి చెందిన కుక్కింద మల్లేశ్, సరోజ(28) దంపతులకు తేజశ్రీ, దివ్య(7), శివతేజ, అక్షయ్కుమార్(3) సంతానం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం సరోజ దుస్తులు ఉతకడానికి నలుగురు పిల్లలను వెంటబెట్టుకొని గ్రామ సమీపంలోని పెద్దచెరువుకు వెళ్లారు. అక్కడ ఆమె దుస్తులు ఉతుకుతుండగా పక్కనే ఆడుకుంటున్న అక్షయ్కుమార్(3) ప్రమాదవశాత్తు నీటిలోకి జారిపడ్డాడు. అతడిని కాపాడేందుకు సరోజ నీటిలో దిగారు. ఆమె మునిగిపోతుండటం గమనించి కుమార్తె దివ్య నీటిలోకిదిగింది
ఆ తర్వాత పెద్ద కుమార్తె తేజశ్రీ నీటిలోకి దిగింది. నీటిలో మునిగిపోతుండటంతో భయంతో ఆమె కేకలు వేసింది. కొంత దూరంలో ఉన్న అర్జున్ అనే రైతు విని.. పరుగున వెళ్లి తేజశ్రీని కాపాడారు. అప్పటికే సరోజ, దివ్య, అక్షయ్కుమార్ మునిగిపోయారు. తల్లి, ఇద్దరు పిల్లల మృతదేహాలను గ్రామస్థులు బయటికితీశారు. సరోజ భర్త మల్లేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని ఎస్సై విక్రమ్ తెలిపారు. కొంతకాలంగా ఆమె మానసిక స్థితి బాగా లేకపోవటంతో వైద్యులకు చూపించామని, మూడు రోజుల క్రితం బ్లేడ్తో చేయి కోసుకున్నారని, శుక్రవారం రాత్రి నిద్రపోలేదని భర్త పేర్కొన్నారు.
Also Read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!