వాళ్లు మామూలు దొంగలు కాదు. సింపుల్‌గా వస్తారు. గేటు తీసుకుని దర్జాగా వెళ్తారు. ఏదో అందినకాడికి తీసుకెళ్లే రకం కాదు.. ఇంట్లో కనిపించిన నీళ్ల బిందెను ఎత్తుకెళ్లారు. ఈ తతంగం అంతా ఇంటి అవరణలో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
మనం దొంగతనాలు గురించి వింటూ ఉంటాం..! మనం కూడా కొన్ని సందర్భాల్లో బాధితులమే.. రకరకాల దొంగతనాలు చూసి ఉంటాం. ఈ విచిత్ర దొంగతనం కొంచెం కామెడీగా ఉంది. కానీ నిజం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో విచిత్ర దొంగతనం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సైతం విస్తుపోయారు..!
ఎవరైనా డబ్బులు కానీ, నగలు గాని లేదా వాహనాలు కానీ దొంగతనం చేస్తారు. కానీ ఈ దొంగ విచిత్రమైన దొంగతనం చేశాడు. అస్సలు ఆ దొంగతనం ఏంటి అనుకుంటున్నారా.. ఇంట్లో ఉండే మంచినీళ్ల బిందె దొంగతనం చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో ఓ కుటుంబం ఉదయం నిద్ర లేచి రాత్రి సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా, వారికి తమ ఇంట్లో దొంగతనం జరిగిందని షాక్ అయ్యారు. కానీ వచ్చిన దొంగ, దొంగిలించిన వస్తువును చూసి నవ్వుకున్నారు.
ఇదేంటని అర్థం కాక తలలు పట్టుకున్నారు. మరి ఆ దొంగ దొంగిలించిన వస్తువు ఒక నీళ్ల బిందె. మరి ఆ దొంగ బంగారు బిందె అనుకున్నాడో, లంకె బిందె అనుకున్నాడో, కానీ ఆ బిందెతో అంత అవసరమేమిటో, అని స్థానికులు నివ్వెరపోతున్నారు. ఈ దొంగతనం దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వీడియో చూడండి..
ఇద్దరు దొంగలు వచ్చి ఓ ఇంటి ముందు చాలాసేపు తచ్చాడారు. ఒక దొంగ బయట ఉంటే.. మరో దొంగ ఇంటి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు. కొద్ది సేపటికే ఇంటి బయట ఉన్న నీళ్ళ బిందె ఎత్తుకొని బయటకు వచ్చాడు. ఇద్దరు దొంగలు కలిసి బిందె తీసుకొని వెళ్ళిపోయారు. ఈ దొంగతనం విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అసలు దొంగలు దేనికోసం వచ్చారు. ఇంట్లో ఏదయినా దొంగతనం కోసం వచ్చారా..? లేక బిందె కోసమే వచ్చారా..? దీనితో అవసరం ఏంటని చర్చ జరుగుతోంది. ఈ దొంగతనంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కొంచెం ఇది కామెడీగా ఉన్నా.. ఇదేమి దొంగతనం అనుకుంటున్నారు స్థానికులు..!
Also read
- Folk Singer Shruthi: పెళ్లై 20 రోజులే.. అనుమాస్పద స్థితిలో ఫోక్ సింగర్ మృతి.. అత్తింట్లో ఏం జరిగింది
- Hyderabad: విగ్గు రాజా.. వీడు మామూలోడు కాదు.. ఏకంగా 50 మందిని..
- Andhra News: ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని పాడుబడ్డ ఇంట్లో అసలు గుట్టు బయటపడింది..
- Andhra Pradesh: హృదయ విదారకర ఘటన.. పడంటి బిడ్డను చూడకుండానే ప్రాణాలు విడిచిన ఎంపీడీవో!
- Andhra News: అడవి పందుల కోసం పెట్టిన ఉచ్చు.. అందులో ఏం చిక్కిందంటే..?