గుంటూరు జిల్లా వెంగళరావునగర్‌లో బాలిక అపహరణం కలకలం రేపింది.
గుంటూరు: గుంటూరు జిల్లా వెంగళరావునగర్‌లో బాలిక అపహరణం కలకలం రేపింది. ఆమె తల్లికి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి గుర్తు తెలియని దుండగులు బాలికను కారులో తీసుకెళ్లారు. విజయవాడ మీదుగా బాలికను తీసుకెళ్లేందుకు ముఠా ప్రణాళిక వేసింది. విజయవాడ బస్టాండ్ వద్ద కారు ఆపి.. ముఠా సభ్యులు భోజనానికి వెళ్లారు.
కారు డోరు లాక్ పడకపోవడంతో బాలిక తప్పించుకుంది. విజయవాడ బస్టాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి బాలిక విషయాన్ని వివరించింది. వెంటనే స్పందించిన ఆర్టీసీ సిబ్బంది కిడ్పాపర్ల నుంచి బాలికను రక్షించారు. విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు కారును అక్కడే వదిలి పరారయ్యారు. ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిడ్నాపర్లు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- ఆలయంలోని మహిళల బాత్రూంలో చొరబడి రహస్య వీడియోలు రికార్డ్
- Andhra: ఎంతపని చేశావ్ మానస.. బాయ్‌ఫ్రెండ్ చెప్పినట్లు చేసింది.. చివరకు
- అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా సెక్రటేరియట్ లోపలికి వెళ్లాడు.. సీన్ కట్ చేస్తే..
- తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి.. ఎందుకంటే..
- నేటి జాతకములు..30 ఏప్రిల్, 2026





