పశ్చిమ గోదావరి జిల్లా / పెనుమంట్ర మండలం :
సుప్రసిద్ధ శైవక్షేత్రం జుత్తిగ లోని శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం జరిగింది. సోమవారం , స్వామివారి జన్మనక్షత్రం కావడంతో, ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది.
అరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని…..ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ , ర్యాలీ వాసు శర్మ ఆధ్వర్యం లో వాసుకి రవి సోమేశ్వర స్వామి కి ఏకాదశ రుద్రాభిషేకం , సువర్ణ జలాభిషేకం , నిర్వహించారు. అనంతరం స్వామివారికి అన్నాభిషేకం, విశేష పూజలు చేశారు. శ్రీ పార్వతీ దేవి అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు . ఈ కార్యక్రమం లో మానవహక్కులు సామాజిక న్యాయం వైస్ ప్రెసిడెంట్ , BTB CEO ముద్రగడ. దుర్గా రెడ్డీ , ఆలయ ఈ ఓ. సోమేశ్వరి , తితిదే వెద పండితుడు వేమూరి ఫణీంద్ర శర్మ , దేవాదాయశాఖ అధికారి సాయి ప్రసాద్ , భక్తులు పాల్గొన్నారు.
Also read
- నీట్ రీ-ఎగ్జామ్కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
- పె…ద్ద రోజు! ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
- మీ ఇంట్లో పగిలిపోయిన విగ్రహాలు ఉన్నాయా.. ఆ విగ్రహాల వల్ల కలిగే నష్టాలు ఇవే!
- Weekly Horoscope: హమ్మయ్య.. వారికి ఆర్థిక కష్టాలు తీరిపోతాయ్..12 రాశులకు వారఫలాలు
- పోస్టుమార్టం నివేదికతో వాస్తవాలు వెలుగులోకి: రాధా గాయత్రి భర్త





