December 18, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

అక్రమ బియ్యం మూలాలపై తనిఖీలు



రేషన్ మాఫియా మూలాలను గుర్తించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి. జూన్ 28, 29 తేదీల్లో పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో పెద్దఎత్తున పేదల బియ్యం పట్టుబడింది.

కాకినాడ: రేషన్ మాఫియా మూలాలను
గుర్తించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి. జూన్ 28, 29 తేదీల్లో పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో పెద్దఎత్తున పేదల బియ్యం పట్టుబడింది. 13 గోదాముల్లోని 26,488 టన్నుల్లో ఫోర్టిఫైడ్ గుళికలున్న బియ్యం ఉన్నట్లు తేలడంతో యాజమాన్యాలపై 6ఏ కేసులు పెట్టారు. కాకినాడ పోర్టు, ఇంద్రపాలెం, సర్పవరం, కరప, కోరింగ పోలీసుస్టేషన్ల పరిధిలో క్రిమినల్ కేసులూ నమోదు చేశారు. వాటి దర్యాప్తు కోసం అయిదు పోలీసు బృందాలను నియమించారు. ఈ బృందాలు కొద్దిరోజులుగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి అక్రమాల మూలాలపై ఆరా తీస్తున్నాయి. గోదాముల్లో పట్టుబడిన బియ్యం నిల్వల బిల్లుల ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. అనపర్తి, మండపేట, రాజానగరం, జగ్గంపేట, కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లోని బియ్యం మిల్లుల్లో రెవెన్యూ, పౌరసరఫరాల సాంకేతిక సిబ్బందితో కలిసి తనిఖీలు  నిర్వహించారు. నిల్వలతోపాటు దస్త్రాలు పరిశీలిస్తున్నారు. పేదల బియ్యం ఎగుమతిదారులకు ఎలా చేరింది, వాటిని అందించిన మిల్లర్లు ఎవరు, ఎవరెవరి నుంచి సేకరించారనే కోణంలో ఈ దర్యాప్తు సాగుతోంది.

Also read

Related posts

Share via