December 18, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

తెలుగు రాష్ట్రాలో సరికొత్త దందా.. ఫుడ్‌బిజినెస్‌ వ్యాపారులే టార్గెట్‌గా నిలువు దోపిడీ..



వాళ్ళని నమ్ముకొని బిజినెస్ చేద్దామనుకున్న వాళ్ళకి అత్యాశే ఎదురవుతుందని ఇలాంటి ముఠాలకు పోలీసులు చెక్ పెట్టాలంటూ కోరుతున్నారు బాధితులు. చెప్పాపెట్టకుండా పారిపోయారని ఎవరికి ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదని



రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రకమైన దందా తెరపైకి వచ్చింది. చూడటానికి చిన్న సమస్యలా కనిపించినా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తప్ప ఇది ఒక పెద్ద దందా అని, దేశ వ్యాప్తంగా విస్తరించిన నెట్ వర్క్ అంటున్నారు నిండా మునిగిన బాధితులు. అలా అని వీళ్ళపై కంప్లైంట్స్ ఉండవు, అలా చూస్తూ ఊరుకోలేమని వ్యాపారమే పెట్టుబడిగా పెట్టి ఎదగాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరిని దెబ్బ కొడుతున్నారాని మోసపోయిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి వెనుక ఉండి నడిపిస్తున్న ముఠాలు దేశవ్యాప్తంగా ఈ రకంగా పెద్ద దందానే జరుగుపుతున్నా కూడా ఎలాంటి ఆధారాలు లేకపోవడం, కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు అంత సీరియస్‌గా తీసుకోకపోవడంతో ఈ ముఠా చేసే మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకీ ఎవరా ముఠా..? ఏంటా స్టోరీ పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ స్టాల్స్‌ యాప్స్‌ పెట్టేవారీ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అందులో ముఖ్యంగా ప్రజలకు ఇష్టమైన వంటకాల విషయంలో దేశ విదేశాలకు సంబంధించి డిష్ లు సిద్ధం చేసే వారిని ఏరి కోరి మరీ ఎక్కువ మొత్తంలో జీతాలు ఇచ్చి రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు ఫుడ్ బిజినేస్ పెడుతున్న నిర్వాహకులు. అయితే వారిలో ముఖ్యంగా స్కిల్ ఉన్న వారికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇదే అదునుగా కొన్ని ఈశాన్య రాష్ట్రాల ముఠాలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీ పైన యువత ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. అయితే ఫుడ్ స్టార్ట్ అప్స్ ఎక్కువగా స్కిల్ వర్కర్స్ తో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కుక్స్, చెఫ్, వర్కర్స్‌ను ప్రత్యేకంగా తమ ఫుడ్ బిజినెస్ అవసరాల కోసం నియమిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్‌లో ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా క్రేజ్‌లో ఉండటంతో ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా ఇతర దేశాల్లో తయారయ్యే ఏ డిష్ ప్రత్యేకించి తయారు చేయాలంటే స్కిల్ కుక్, లేదా చెఫ్ తోనే సాధ్యమవుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎక్కడ ఫుడ్ స్టార్ట్ అప్స్ , ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసినా హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ లాంటివి ప్రారంభించినా కూడా ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎక్కువగా వర్కర్స్ గా నియమిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొన్ని ఈశాన్య రాష్ట్రాల ముఠాలు భారీ ఎత్తున దందాకు, దోపిడీకి, మోసాలకు తెరలేపాయి. దీనితో పెట్టుబడి పెట్టిన చాలా మంది ఈ ఈశాన్య రాష్ట్రాల ముఠాల ఉచ్చులో ఇరుక్కొని బయటకు రాలేక అలా బిజినెస్‌ క్లోజ్ చేయలేక నడపలేక లబోదిబోమంటూ తలలు బాదుకుంటున్నారు

Also read

Related posts

Share via