గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీఏని పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ ప్రభుత్వ సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయంలపై దాడి కేసులో వంశీ పీఏతో పాటు మొత్తం 11 మంది అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కొందరిని అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయంలపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి కేసులో ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీఏని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరికొందరిని కూడా అదుపులోకి..
వంశీ పీఏతో పాటు అతని అనుచరులు మొత్తం 11 మందిని పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు విజయవాడ, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన ఇంకొందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో టీడీపీ కార్యాలయంపై దాడులు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ విషయన్ని సీరియస్‌గా తీసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీని కొన్ని నెలల కిందట పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ A 71గా ఉన్నారు. వల్లభనేని వంశీ హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుండగా ఏపీ పోలీసులు వాహనాన్ని వెంబడించిన అతడిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే వల్లభనేని వంశీతో పాటు అతని అనుచరులు 18 మందిని అరెస్ట్ చేశారు. వంశీ ప్రోద్బలంతోనే టీడీపీ ఆఫీసు దాడి జరిగిందనే ఆరోపణలు వినిపించాయి. అప్పుడు అరెస్ట్ అయిన వారిలో వంశీ ప్రధాన అనుచరులు ఉన్నారు. మూల్పూరి ప్రభుకాంత్, నగేష్, డొక్కు వెంకన్నబాబు, నాగరాజు, డ్రైవర్ దుర్గారావు, కరీముల్లా, రెబ్బాని సహా మరో 8మంది ఉన్నారు. నూజివీడు సబ్ జైలుకు 15 మంది నిందితులను తరలించారు
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో