December 5, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Crime news: మత్తు మందు ఇచ్చి నిప్పంటించి.. భార్యపై భర్త దుర్మార్గం

భార్యకు మత్తుమందు ఇచ్చి, మంటలు అంటుకునే పొడి శరీరంపై చల్లి నిప్పంటించి ఓ భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్యాస్టస్టవ్ ప్రమాదమని చుట్టుపక్కల వారిని నమ్మించాడు.

విశాఖపట్నం (మాధవధార), : భార్యకు మత్తుమందు ఇచ్చి, మంటలు అంటుకునే పొడి శరీరంపై చల్లి నిప్పంటించి ఓ భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్యాస్టవ్ ప్రమాదమని చుట్టుపక్కల వారిని నమ్మించాడు. కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కోలుకోవడంతో అసలు విషయం బయటపడింది. వివరాలివీ… విశాఖలోని మురళీనగర్ సింగరాయ కొండపై నివసిస్తున్న వెంకటరమణ, కృష్ణవేణిలకు ఐదేళ్ల క్రితం పెళ్లయి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటరమణకు మద్యం వ్యసనంతో పాటు భారీగా అప్పులున్నాయి. భార్య వద్దఉన్న బంగారాన్నీ తాకట్టు పెట్టాడు. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. నవంబరు 23న పాప మొదటి పుట్టినరోజు నాటికి బంగారాన్ని విడిపించాలని భార్య తల్లిదండ్రులూ పట్టుబట్టారు.

ఈలోగా భార్యను చంపేయాలని భావించి 16వ తేదీ రాత్రి వెంకటరమణ మద్యం తాగి తనతోపాటు మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ తెచ్చి భార్యకు ఇచ్చాడు. ఆమె తాగగానే కళ్లు తిరిగి తూలుతున్నప్పుడే గ్యాస్టవ్ వద్దకు తీసుకెళ్లాడు. దుస్తులపై పొడి చల్లి స్టవ్ వెలిగిస్తున్నానంటూ అగ్గిపుల్లను ఆమె దుస్తులపై వేశాడు. కళ్లెదుటే భార్య కాలిపోతున్నా తలుపు తీయకుండా అక్కడే ఉన్నాడు. మత్తుమందు ప్రభావం నుంచి కాస్త కోలుకున్నాక కృష్ణవేణి అరుపులతో చుట్టుపక్కలవారు వచ్చి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమచికిత్స చేయించి కేజీహెచ్కు తరలించారు. గొంతువద్ద బాగా కాలిపోవడంతో శనివారం వరకు ఆమె మాట్లాడలేకపోయారు. కోలుకున్నాక బాధితురాలు వివరాలు చెప్పడంతో వెంకటరమణపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Also read

Related posts

Share via