• 141 ఏళ్ల జైలు శిక్ష విధించిన కేరళ కోర్టు
మలప్పురం: మైనర్ అయిన సవతి కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ కోర్టు 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో చట్టం, ఐపీసీ, జువెనైల్ జస్టిస్ చట్టం కింద వివిధ నేరాలకు గాను దోషి ఏక కాలంలో ఈ శిక్ష అనుభవించాలంటూ మంజేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి అప్రాఫ్ ఏఎం నవంబర్ 29వ తేదీన తీర్పు వెలువరించారు. అయితే, దోషి 40 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అతడికి విధించిన శిక్షల్లో ఇదే అత్యధికమని ఆయన ఆ తీర్పులో పేర్కొన్నారు. అదేవిధంగా, బాధితురాలికి పరిహారంగా 5.7.85 లక్షలు చెల్లించాలని కూడా దోషిని ఆదేశించారు. బాలికపై ఆమె తల్లి ఇంట్లో లేని సమయాల్లో 2017 నుంచి సవతి తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025