February 4, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: మద్యం మత్తులో నిత్యం భార్యకు నరకం చూపించిన భర్త.. చివరికి ఏం చేసిందో తెలుసా?

 

వైరా మండల విద్యా శాఖలో రెబ్బవరం క్లస్టర్ సీఆర్పీగా రవి పని చేశారు. అతను ప్రతి రోజూ మద్యం సేవించి విధులకు హాజరవుతుండటం, ఎన్నిసార్లు మందలించినా.. అతని తీరు మారలేదు.


భర్త వేధింపులు తట్టుకోలేక విసిగి వేసారిన భార్య తెగించింది. అందరు చూస్తుండగానే భర్తపై కత్తితో దాడి చేసింది. అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.

వైరా మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన పోరాళ్ళ రవిపై అతని భార్య లక్ష్మి కత్తితో దాడి చేసింది. కొన్ని నెలల క్రితం వరకు రవి, వైరా మండల విద్యా శాఖలో రెబ్బవరం క్లస్టర్ సీఆర్పీగా పని చేశారు. అయితే అతను ప్రతి రోజూ మద్యం సేవించి విధులకు హాజరవుతుండటం, ఎన్నిసార్లు మందలించినా.. అతని తీరు మారలేదు. దీంతో అధికారులు అతన్ని విధుల్లో నుంచి తొలగించారు. ఇదే విషయంపై గత కొంత కాలంగా రవి అతని భార్య లక్ష్మి మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలలో రవి అయ్యప్ప మాలను ధరించాడు. అయితే తన బంధువులు చనిపోవడంతో గత ఐదు రోజుల క్రితం అయ్యప్ప మాల విరమణ చేశాడు. మళ్ళీ మద్యానికి బానిస అయ్యాడు. దీంతో రవి భార్యతో గొడవకు దిగాడు.

ఈ క్రమంలోనే భర్త వేధింపులను తట్టుకోలేక విసిగిపోయిన భార్య లక్ష్మి శుక్రవారం(నవంబర్ 29) రవిపై కత్తితో దాడి చేసింది. శుక్రవారం ఉదయం మద్యం సేవించిన రవి ఇంటికి వెళ్లి భార్యతో గొడవకు దిగాడు. అంతేకాకుండా భార్యపై దాడి చేయడంతో ఆ సమయంలో కోపోద్రిక్తురాలైన ఆమె ఇంట్లో ఉన్న కత్తితో అతనిపై దాడి చేసింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే రవిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి వైరా పోలీసులు చేరుకుని భార్య లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. వైరాలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో టీచర్ గా పని చేస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు

Also read

Related posts

Share via