SGSTV NEWS
Andhra PradeshViral

అమ్మ బాబోయ్..! పొలం పనులకు వెళ్లిన రైతు.. కనిపించిన సీన్ చూసి గుండె జారిపోయింది..!




అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో భారీ గిరినాగు హల్‌చల్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ 12 అడుగుల భారీ గిరినాగు రైతు పొలంలో తిష్ట వేసింది.


అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో భారీ గిరినాగు హల్‌చల్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ 12 అడుగుల భారీ గిరినాగు రైతు పొలంలో తిష్ట వేసింది. ఓ రక్తపింజర పామును వేటాడి మింగేసింది. ఇదంతా చూసిన అక్కడి వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానిక ప్రజలు సైతం భయంతో వణికిపోయారు.



వెంటనే గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వాళ్లు స్నేక్ క్యాచర్‌ను పిలిపించారు. గంట పాటు శ్రమించిన స్నేక్ స్నాచర్స్ గిరినాగును బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంత పెద్ద గిరినాగు ఈ ప్రాంతంలో ఎప్పుడు చూడలేదని స్థానికులు అంటున్నారు

Also read

Related posts