ప్రియురాలి పట్ల ఓ రాక్షసుడు నీచంగా వ్యవహరించాడు. ప్రేమిస్తున్నానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. శారీరకంగా లొంగదీసుకున్నాడు.. ఇది చాలదన్నట్లు.. తనలోని నీచమైన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ప్రేమించిన ప్రియురాలిపైనే దారుణానికి దిగాడు. ఈ ఘటన విశాఖ సాగర నగరంలో వెలుగులోకి వచ్చింది.
విశాఖపట్నంలో ప్రియురాలి పట్ల ప్రియుడే నయవంచకుడిగా మారాడు. యువతితో చనువుగా ఉన్న సమయంలో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆపై.. తన ముగ్గురు ఫ్రెండ్స్‌కు కూడా వీడియోలు షేర్ చేశాడు.. ఆ తర్వాత నలుగురూ ఆమెతో నీచంగా వ్యవహరించారు. యువతిని బెదిరిస్తూ ఒక్కొక్కరు ఒక్కో సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడడం కలకలం రేపింది. చివరికి.. ప్రేమించి.. పెళ్లి చేసుకుందామని చెప్పినోడు కూడా ఆ వీడియోతో బెదిరింపులకు దిగడంతో తీవ్ర వేదనకు గురైంది. మానసికంగా కుంగిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కానీ.. కూతురి ఆత్మహత్యాప్రయత్నాన్ని అడ్డుకున్న తండ్రి.. ఆమె వేదన వెనకున్న కారణాలపై ఆరా తీశాడు. దాంతో.. జరిగిందంతా చెప్పి కన్నీరుమున్నీరుగా విలపించింది బాధితురాలు.
అయితే.. ఇలాంటి పరిస్థితులు.. ఇలాంటి అన్యాయం మరొకరికి జరగకూడదనే ఆలోచనతో విశాఖ పోలీసులను ఆశ్రయించారు బాధితురాలి కుటుంబసభ్యులు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు యువతి క్లాస్‌మేట్స్ ఉన్నారు.. అయితే.. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతితో నేరస్థులు నలుగురు దారుణంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.. బాధిత యువతి న్యాయ విద్యను అభ్యసిస్తోంది..
ఇక.. ఈ దారుణ ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. విశాఖ సీపీ శంకబ్రత బాగ్చీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు హోంమంత్రి అనిత..
కాగా.. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది.. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





