ఆర్టీసీలో అద్దె బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. సాధారణంగా ఎవరైనా ప్రయాణికుడు బస్సులో తమ లగేజీ మర్చిపోతే దానిని బస్సు డిపోలో అప్పగిస్తారు. వారు ప్రయాణికుడి వివరాలు కనుక్కుని అందజేస్తారు. అయితే, ఈ బస్సు డ్రైవర్ మాత్రం ఆ పనిచేయకుండా అందులోని బంగారు నగలను కాజేశాడు. అయితే ఈ తతంగాన్ని ఓ ప్రయాణీకుడు తన సెల్ఫోన్లో రికార్డు చేయడంతో బండారం బయటపడింది. డ్రైవర్‌ను నిలదీయగా అది కిందపడిపోయిందని, అందుకే తీశానని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిం
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




