వరంగల్‌లో పోలీసులు స్నీఫర్ డాగ్‌ను తీసుకుని వచ్చి రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ జాగిలం పరిగెత్తి వెళ్లి ఓ ఇంటి మేడపై పూలకుండీలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని పట్టించింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు
ఇటీవల వచ్చిన ఓ సినిమాలో ఇంటి మేడ పైన గంజాయి మొక్కలను పెంచుతున్న సీన్ నిజ జీవితంలోనూ జరిగింది. వరంగల్‌లో పోలీసులు జాగిలాన్ని తీసుకొచ్చి చెకింగ్‌లు చేస్తుండగా వారికి ఊహించిని షాక్ కనిపించింది. వరంగల్ సిటీలో గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు పోలీసులు కొత్తగా స్నీఫర్ డాగ్‌ను తీసుకొచ్చారు. దీన్ని తీసుకుని వరంగల్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టగా.. ఆ స్నీఫర్ డాగ్ ఒక్కసారిగా బయటకు పరిగెత్తింది.
పూలకుండీల్లోనే గంజాయి మొక్కలు..
ఒక అతని ఇంటి మేడ వైపుకు పరిగెత్తింది. దీంతో పోలీసలు ఈ జాగిలం కొత్తది కావడం వల్ల గందరగోళానికి గురయ్యారు. కానీ ఆ మేడ ఎక్కిన తర్వాత వారు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన పల్లెబోయిన కుమార్ ఉద్యోగం చేస్తూనే, ఇంకా డబ్బులు సంపాదించాలని ఇంట్లోనే మేడపైన పూలకుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు.
రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు అనుమానస్పదంగా ప్రయాణికుల సామానుతో పాటు, బ్యాగ్ లను పోలీసులు పోలీస్ జాగిలంటో తనిఖీ చేయించారు. దీంతో అతని యవ్వారం బయటపడింది. వెంటనే పోలీసులు ఆ గంజాయి మొక్కలను పెంచుతున్న యజమానిని అదుపులోకి తీసుకున్నారు.
డబ్బు కోసమే ఇలా చేసినట్లు తెలిపాడు. వెంటనే అతన్ని మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం కింద అరెస్ట్ చేశారు. నగరంలో ఎవరైనా మత్తు పదార్థాలు వాడుతున్నా, అక్రమంగా కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్న, విక్రయిస్తున్న కూడా తక్షణమే 8712584473 ఈ నంబర్‌కు సమాచారం అందించాలని వరంగల్ పోలీసులు తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025