హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో చికెన్ మోమోస్ తిని ఓ వివాహిత మహిళ మృతి చెందగా 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. బాధితులు వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నంది నగర్‌లో చికెన్ మోమోస్ తిని ఒక వివాహిత మహిళ మృతి చెందగా 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. బాధితులు వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మోమోస్ తింటే ఇంత ప్రమాదమా?
ఇదిలా ఉండగా ఫుడ్స్ లవర్స్ ఎక్కువగా మోమోస్ తింటారు. మైదాతో చేసే ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మోమోస్ ఆరోగ్యానికి చేసే ప్రయోజనాలు కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. డైలీ మోమోస్ తినడం వల్ల జీర్ణ క్రియ ఆరోగ్యం దెబ్బతింటుంది. మోమోస్‌ను మైదా పిండితో చేయడం వల్ల ఇవి మలబద్ధకం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
మోమోస్ తినడం వల్ల కొందరికి ఫుడ్ అలెర్జీ కూడా అవుతుంది. వీటిని తయారు చేసేటప్పుడు కొందరు నాణ్యమైన పదార్థాలను వాడకపోవడం వల్ల ఫుడ్ అలెర్జీ వస్తుంది. అలాగే ఈ మోమోస్ వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
ఈ మోమోస్‌ను తరచుగా తినడం వల్ల ఊబకాయం, టైప్ 2 మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంది. వీటితో పాటు గాస్ట్రిక్ సమస్యలు, క్యాన్సర్ బారిన కూడా పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్‌కి బాగా అలవాటు పడ్డారు. హెల్తీగా ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్స్ కంటే ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల అనారోగ్య బారిన పడుతున్నారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!