November 21, 2024
SGSTV NEWS
Spiritual

దీపావళి నాడు పెరుగుతో ఇలా చేశారంటే – మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట!


పెరుగుతో దీపావళి రోజు ఈ చిన్న పని చేయండి – లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపాదన డబుల్!



ప్రతి వ్యక్తి అమితమైన సంపదను కోరుకుంటారు. అది సాధ్యం కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక ఉండాల్సిందే! ఈ కారణం చేతనే సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు అనేక పూజా కార్యక్రమాలు చేపడుతుంటారు. అయినప్పటికీ కొంతమందిని ఆర్థిక సమస్యలను వెంటాడుతుంటాయి. అలాంటి వారు దీపావళి రోజు పెరుగుతో ఈ చిన్న పని చేయండి. మీరు ఊహించని అదృష్టం కలసి రావడమే కాదు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటున్నారు ప్రముఖ జ్యోతిష్యనిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. ఇంతకీ, దీపావళి వేళ పాటించాల్సిన ఆ ప్రత్యేక విధివిధానమేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దీపావళికి, పెరుగుకి అద్భుతమైన సంబంధం ఉందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. అందుకు కారణమేమిటంటే.. దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ సమయంలో క్షీరసాగరం నుంచి లక్ష్మీదేవి ఒక దీపం రూపంలో దీపావళి రోజునే ఉద్భవించినదట. ఇక్కడ పాల సముద్రం అంటే పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులన్నింటికీ సంకేతం. కాబట్టి పెరుగులో లక్ష్మీదేవి ఉంటుందట. అందుకే ఎవరైనా సరే దీపావళి రోజు పెరుగును ఉపయోగించి ఒక ప్రత్యేకమైన విధివిధానం పాటిస్తే ఊహించని విధంగా అదృష్టం కలసివస్తుందని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది.

దీపావళి నాడు పెరుగుతో ఏం చేయాలంటే?

దీపావళి రోజు మీరు పాటించాల్సిన ఆ ప్రత్యేకమైన విధివిధానమేంటంటే.. మీరు స్నానం చేసే నీళ్లలో రెండు స్పూన్ల పెరుగు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ వాటర్తో స్నానమాచరించాలి. ఇది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన స్నానం అవుతుంది. దాంతో మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటున్నారు జ్యోతిష్యులు. ఇక్కడ మీరు తీసుకునేది ఆవు పెరుగు అయితే మరీ మంచిది. అది లభించని పక్షంలో గేదె పెరుగును వాడుకోవచ్చంటున్నారు. అయితే, స్నానమాచరించడానికి ముందు ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే ఇంకా మంచిదంటున్నారు.

స్నానానికి ముందు ఇలా చేయాలట!

దీపావళి రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి ఉంటుందట. అందుకే ఎవరైతే ఆరోజు ఒంటినిండా నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు . అలాగే, దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. కాబట్టి స్నానం చేసే ముందు ఈ పరిహారం పాటించి ఆ తర్వాత వాటర్లో రెండు స్పూన్ల పెరుగు వేసుకొని ఐదు నిమిషాలు ఆగి స్నానమాచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు.

స్నానానికి ముందు ఇలా చేయాలట!

దీపావళి రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి ఉంటుందట. అందుకే ఎవరైతే ఆరోజు ఒంటినిండా నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు . అలాగే, దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. కాబట్టి స్నానం చేసే ముందు ఈ పరిహారం పాటించి ఆ తర్వాత వాటర్లో రెండు స్పూన్ల పెరుగు వేసుకొని ఐదు నిమిషాలు ఆగి స్నానమాచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు.

ఇలా స్నానం చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయట. మొండి బాకీలు ఏమైనా ఉంటే తొందరగా వసూలు అవుతాయంటున్నారు. అంతేకాదు, అనేక మార్గాల ద్వారా ధన ఆదాయం పెరుగుతుందట. దీపావళి నాడు ఈ ప్రత్యేకమైన విధివిధానం పాటించడం వల్ల ఆకస్మికంగా అదృష్టం కలసివచ్చి ధనప్రాప్తిని సిద్ధించుకోవచ్చంటున్నారు జ్యోతిష్యులు. ఒకవేళ వీలైతే పెరుగుతో రెండో మూడో మామిడాకులు కూడా స్నానం చేసే వాటర్లో వేసుకొని 5 నిమిషాల తర్వాత స్నానమాచరిస్తే ఇంకా మంచి ఫలితాలు సిద్ధిస్తాయంటున్నారు.

Related posts

Share via