November 21, 2024
SGSTV NEWS
CrimeNational

ఒకప్పుడు ఎమ్మెల్యే.. ఇప్పుడు నిందితురాలు… పోలీసులకు చిక్కి..

గతంలో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసి గెలుపొంది.. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తించింది. కానీ ఇప్పుడు నిందితురాలిగా పోలీసులకు చిక్కింది. అసలు ఏమైందంటే..?

ప్రజా ప్రతినిధి అంటే.. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండటం. ఆ ప్రతినిధులు మాజీలు అయినా సరే.. సమాజంపై రెస్పాన్సిబులిటీ ఉంటుంది. పదవిలో లేను కదా.. ఏం చేసినా చెల్లుతుందని భావిస్తే.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. గతంలో ప్రజా సేవకురాలిగా బాధ్యతలు నిర్వహించిన ఓ మహిళా ఎమ్మెల్యే.. మాజీ కాగానే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడింది. చివరకు పోలీసులకు చిక్కింది. 100 గ్రాముల హెరాయిన్ అమ్ముతూ పట్టుబడింది. పంజాబ్ ఫిరోజ్ పూర్ మాజీ ఎమ్మెల్యే సత్కార్ కౌర్ గెహ్రీ, ఆమె మేనల్లుడు జస్కీరత్ సింగ్‌లను యాంటీ నార్కోటిక్ స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రాజకీయ వర్గాల్లో పెను దుమారం చెలరేగింది. సత్కార్ కౌర్ గతంలో కాంగ్రెస్‌లో ఉండగా.. ప్రస్తుతం బీజెపీలో ఉన్నారు. దీంతో అధికార పార్టీ.. ప్రతిపక్షంపై విమర్శలు గుప్పిస్తోంది.


కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే సత్కార్ కౌర్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులకు కీలక సమాచారం అందింది. ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పోలీస్ బాబాయిలు రంగంలోకి దిగారు. కస్టమర్లుగా నటిస్తూ.. సత్కార్, ఆమె మేనల్లుడ్నీ మీట్ అయ్యారు. వెనక ఉండి నడిపించేది అంతా ఆమె అయితే.. ఆ డీల్ క్లోజ్ చేసేది ఆమె మేనల్లుడు. తాజాగా పోలీసులతో డీలింగ్ చేశాడు జస్కీరత్. రూ. 2.5 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. స్పాట్ చెప్పి.. అక్కడకు వచ్చేయమని చెప్పాడు జస్కరీత్. ఖరద్‌లోని సన్నీ ఎన్ క్లేవ్ సమీపంలో ప్లేస్ ఫిక్స్ చేశారు. హెరాయిన్‌తో సత్కార్, ఆమె మేనల్లుడు రాగా, కస్టమర్ల వేషంలో పోలీసులు.. అక్కడకు వచ్చారు. డ్రగ్స్ చేతిలో పడగానే.. యువర్ అండర్ అరెస్ట్ అంటూ కామన్ డైలాగ్ చెప్పారు. ఖంగుతిన్న నిందితులు.. వెంటనే అక్కడ నుండి పారిపోయేందుకు ప్రయత్నించారు.

కారులో తప్పించుకునే ప్రయత్నంలో.. ఓ పోలీసును ఢీ కొట్టాడు జస్కీరత్. అయినప్పటికీ నిందితుల్ని వదిలిపెట్టలేదు. సినిమా లెవల్లో ఛేజింగ్ చేసి ఇద్దర్ని పట్టుకున్నారు. తమదైన స్టైల్లో విచారణ చేపట్టగా.. నిజాలన్నీ కక్కేశారిద్దరు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు చేపట్టగా.. 28 గ్రాముల హెరాయిన్ లభ్యమైంది. మొత్తంగా 128 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్. అలాగే డ్రగ్స్ రాకెట్ కోసం వినియోగించిన హర్యానా, ఢిల్లీ రిజిస్టేషన్స్‌తో ఉన్న నాలుగు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 2017లో ఫిరోజ్ పూర్ రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సత్కార్ పోటీ చేసి గెలుపొందారు. 2022లో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. దీంతో బీజెపీలో చేరారు. ఇప్పుడు డ్రగ్ కేసులో పట్టుబడటంతో రాజకీయాల్లో సంచలనగా మారింది. అధికార పక్షం చేసే విమర్శలకు తావినిచ్చినట్లయ్యింది

Also read

Related posts

Share via