యలమంచిలి రూరల్: భార్య చెల్లెలిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఓ కామాంధుడిపై యలమంచిలి పట్టణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పట్టణ ఎస్సై కె. సావిత్రి మంగళవారం రాత్రి మీడియాకు తెలియజేసిన వివరాల ప్రకారం పట్టణంలోని ధర్మవరం వీధి సీపీ పేటకు చెందిన బంగారు వెంకీ (19) భార్య ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
ఆమెకు సేవలందించడానికి 16 ఏళ్ల చెల్లెలు ఆమె వద్ద ఉంటోంది. భార్య గర్భంతో ఉన్న సమయంలో ఆమె చెల్లెలిపై కన్నేసిన నిందితుడు ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. బాలిక ముభావంగా ఉండటం, స్కూల్కు వెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు ఆరా తీయగా బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని చెప్పుకుంది.
ఈ ఘోరంపై మంగళవారం రాత్రి తన తల్లిదండ్రులతో కలిసి బాలిక పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి రాత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై తెలిపారు.
Also read
- Telangana: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. గన్తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





